iDreamPost

ఆటో ఫ్లైయింగ్ ప్లేన్ లో అదెలా సాధ్యం? యానిమల్ లో గృహలక్ష్మికి డౌట్!

  • Published Jan 29, 2024 | 9:17 PMUpdated Jan 31, 2024 | 9:32 AM

ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్, రష్మిక మందన కాంబీనేషన్ లో తెరకెక్కించిన యానిమల్ సినిమా ఓటీటీలోొ అలారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాను ఓటీటీలో వీక్షించిన బుల్లితెర నటి పలు సంచలన వ్యాఖ్యాలు చేసింది.

ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్, రష్మిక మందన కాంబీనేషన్ లో తెరకెక్కించిన యానిమల్ సినిమా ఓటీటీలోొ అలారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాను ఓటీటీలో వీక్షించిన బుల్లితెర నటి పలు సంచలన వ్యాఖ్యాలు చేసింది.

  • Published Jan 29, 2024 | 9:17 PMUpdated Jan 31, 2024 | 9:32 AM
ఆటో ఫ్లైయింగ్ ప్లేన్ లో అదెలా సాధ్యం? యానిమల్ లో గృహలక్ష్మికి డౌట్!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ కాంబీనేషన్ లో తెరకెక్కించిన సినిమా ‘యానిమల్’. ఇందులో రణ్ బీర్ కి జంటగా రష్మిక నటించిన విషయం తేలిసిందే. అయితే ఈ సినిమా భారీ అంచనాల నడుమ గతేడాది డిసెంబర్ 1న విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ మూవీ పై భారీ స్థాయిలో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదురయ్యాయి. ఎందుకంటే ఈ సినిమాలో చాలా బోల్డ్ కంటెంట్ తో పాటు గృహ హింసకు సంబంధించిన సన్నివేషలు ఉండటంతో పురుషులు సైతం ఈ సినిమాను విమర్శించారు. కానీ, కలెక్షన్స్ పరంగా ఈ మూవీ ఎక్కడ తగ్గలేదు. ఇదిలా ఉంటే.. ఇటీవలే యానిమల్ సినిమా ఓటీటీలో అలరిస్తున్న సంగతీ తెలిసిందే. ఇక ఈ సినిమా వీక్షించిన ప్రముఖ బుల్లితెర నటి నాకు చాల విసుగొచ్చిందంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రస్తుతం యానిమల్ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫిక్స్ లో అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను కొంతమంది బాగుందని అంటుంటే.. మరికొందరు ఇదేం సినిమా అంటూ తల పట్టేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా బుల్లితర గృహలక్ష్మీ కస్తూరీ సైతం యానిమల్ సినిమా పై సోషల్ మీడియాలో కౌంటర్ల్ వేసింది. అందులో.. ”లాస్ట్ నైట్ ఈ యానిమల్ మూవీని చూద్దామని స్టార్ట్ చేశా. కానీ, సగం కూడా కాలేదు.. అప్పటికే నాకు విసుగొచ్చింది. అసలు ఈ సినిమాను థియేటర్లో జనాలు ఎలా చూశారు, మూడున్నర గంటలు ఎలా ఉన్నారు.. ఇక ఆటో ఫ్లైయింగ్ ప్లేన్‌లో ఆ సీన్లు ఏంటి? ప్రేమలో పడటం ఏంటి? మాట్లాడుకునే టైంలోనే అలా అయిపోవడం ఏంటి?.. అసలు వాళ్లు ఎక్కడికి వెళ్లారు. వామ్మో.. నన్ను తప్పుగా తీసుకోకండి. ఈ సినిమాను టాప్ నాచ్‌లో తీశాడు. కానీ, ఆ స్థాయిని మనం అందుకోలేం. అందులో చాలా ఉంది. కానీ.. ఆ సినిమా నన్ను ఎంటర్టైన్ చేయలేదు” అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో కౌంటర్లు వేసింది.

ఇప్పటికే యానిమల్ సినిమా పై తమిళనాట ప్రేక్షకులు నుంచి భారీగా విమర్శలు వస్తున్నాయి. వారితోపాటు నటి రాధిక కూడా ఈ సినిమా పై ఘాటు గా స్పదించింది. అయితే సినిమా పేరు ప్రస్తావించకుండా.. అదోక చెత్త సినిమా, చూస్తేనే కోపం వచ్చిందంటూ మండిపడింది. అలా తమిళ ప్రేక్షకుల నుంచి యానిమల్ మూవీ మీద విపరీతమైన ట్రోలింగ్ చేస్తుండటంతో.. కొంత మంది లియోలోని సిల్లీ సీన్లను మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారు. అలా లియో సినిమా ఎలా ఉంది? పొన్నియన్ సెల్వన్ ఎలా ఉందో ఓ సారి చూసుకోండంటూ రివర్స్‌లో ట్రోలింగ్ చేస్తున్నారు. మరి, యానిమల్ సినిమా పై నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి