iDreamPost

నా పెళ్లి జరగనివ్వండి అంటున్న వరుడు!.. అసలేం జరిగిందంటే?

నా పెళ్లి జరగనివ్వండి అంటున్న వరుడు!.. అసలేం జరిగిందంటే?

పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో జరిగే ఓ మధురమైన ఘట్టం. దీనికోసం ఎన్నో కలలుకంటటుంటారు. నిర్ణయించిన ముహూర్తానికి పెళ్లి అంగరంగవైభవంగా జరిగేలా ప్లాన్ చేసుకుంటారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా మూడుముళ్ల బందంతో ఒక్కటవుతారు. అలా అనుకున్న ముహుర్తానికి పెళ్లి జరగకపోతే కొంత నిరుత్సాహానికి గురవుతుంటారు. ఇదే క్రమంలో ఓ వరుడు తన పెళ్లి సరిగ్గా అనుకున్న ముహుర్తానికి జరుగుతుందో లేదో అని గాబర పడ్డాడు. దీనికోసం అధికారులను వేడుకున్నాడు. పెళ్లి ముహూర్తం దాటిపోతుందేమో అంటూ ఆందోళనకు గురయ్యాడు. అసలు ఏం జరిగింది? ఆ వివరాలు మీ కోసం..

తన పెళ్లి కోసం వరంగల్ నుంచి తొర్రూర్ కు కారులో బయలుదేరిన వరుడు మార్గమధ్యలో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాడు. దీంతో అతడు పెళ్లి ముహూర్తం దాటిపోతుందంటూ ట్రాఫిక్ క్లియర్ చేయాలని అధికారులను వేడుకున్నాడు. ఈ ఘటన వర్థన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందంటే? వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తపడింది. దీంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు ఆయిల్ ట్యాంకర్ ను రోడ్డుపై నుంచి తొలగించేందుకు భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు.

ఇదే సమయంలో వరంగల్ నుంచి తొర్రూరుకు వెళ్తున్న వరుడు ట్రాఫిక్ లో చిక్కుకున్నాడు. ఉదయం 10 గంటలకు పెళ్లి ముహూర్తం ఉండడంతో ముహూర్తం దాటిపోతుందేమోనని ఆందోళన చెందాడు. దీంతో కారు దిగి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లి వాహనాలను త్వరగా పంపించండి సార్ అంటూ అధికారులను వేడుకున్నాడు. ఇది విన్న అధికారులు కాస్త సమయం పడుతుందంటూ వరుడితో చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ట్రాఫిక్ క్లియర్ అవడంతో పెళ్లి వేడుకకు బయలుదేరాడు వరుడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి