iDreamPost

పిల్లలు ఇష్టంగా తినే కాటన్‌ క్యాండీలపై ప్రభుత్వం నిషేధం! చాలా డేంజర్!

  • Published Feb 12, 2024 | 3:38 PMUpdated Feb 12, 2024 | 3:38 PM

ఎంతోమంది పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే కాటన్ క్యాండీ అనేది ఒక్కసారిగా నిషేధించబడింది. కారణం తెలిస్తే షాక్ అవుతారు.

ఎంతోమంది పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే కాటన్ క్యాండీ అనేది ఒక్కసారిగా నిషేధించబడింది. కారణం తెలిస్తే షాక్ అవుతారు.

  • Published Feb 12, 2024 | 3:38 PMUpdated Feb 12, 2024 | 3:38 PM
పిల్లలు ఇష్టంగా తినే కాటన్‌ క్యాండీలపై ప్రభుత్వం నిషేధం! చాలా డేంజర్!

చాలామంది పిల్లలు ‘కాటన్‌ క్యాండీ’ అంటే ఎంతో ఇష్టంగా తింటారు. ఇది చూడటానికి రంగురంగులగా ఎంతో ఆకర్షణీయంగా రుచిగా ఉంటుంది. అందువల్ల పెద్దవాళ్లు సైతం దీనిని ఎంతో అమితంగా తింటారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ క్యాండీ అమ్మాకాలు అనేవి మరింత ఎక్కువగా పెరిగాయి. ముఖ్యంగా పార్క్ ల్లో,సినిమా హాళ్లలో, బీచ్ రోడ్లలో , షాపింగ్ మాల్ లో ఇలా ఎక్కడబడితే అక్కడ అందుబాటులోకి దొరకుతున్నాయి. అలాగే ధర కూడా తక్కువగా ఉండటంతో కస్టమర్లు ఆకర్షితులు అవుతున్నారు. దీంతో ఇవి భారీ సంఖ్యల్లో అమ్ముడుపోతున్నాయి. అయితే పైకి కలర్ ఫుల్ గా, రుచికరంగా కనిపించిన ఈ కాటన్ క్యాండీ అనేది చాలా ప్రమాదకరమైనది. దీనిని విక్రయిస్తున్నా వ్యాపారస్తులు నాణ్యత లేని సరుకుగా మార్కెట్ లోకి అందుబాటులోకి తెస్తున్నారు. అలాగే దీనిలో విషపూరితమైన రసాయనం ఉపాయోగించి అమ్ముతున్న కారణంగా.. వెంటనే దీనిపై గవర్నర్ తమిళి సై నిషేధం విధించారు. ఆ వివారళ్లోకి వెళ్తే..

పిల్లలు బయటకి వెళ్తే చాలు.. ఎక్కువగా తినుబండారలను కొనమని మారం చేస్తుంటారు. అందులో ఎంతో తియ్యగా కలర్ ఫుల్ గా కనిపించే ‘కాటన్ క్యాండీ’ ని అయితే అసలు మిస్ చేయరు. ఎలా అయిన సరే వాటిని కొనమని మారం చేస్తారు. ఈ క్రమంలోనే పిల్లలకు కొని ఇవ్వడమే కాకుండా.. పెద్దవాళ్లు సైతం వాటిని టేస్ట్ చేస్తారు. ఇలా ఎంతో ఇష్టంగా తినే ఈ కాటన్ క్యాండీని అనేది చాలా ప్రమాదకరమని అధికారులు సూచించారు. ఎందుకంటే.. ఈ క్యాటన్ క్యాండీలో.. ‘రోడోమైన్ బీ’ అనే రసాయనాన్ని ఆహార పదార్థాలకు రంగు వచ్చేందుకు ఉపయోగిస్తారని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హెల్త్ అధికారులు తెలిపారు. ఇది శరీరంలోకి ప్రవేశించినప్పుడు కణాలలో ఆక్సీకరణ ఉద్రిక్తతకు కారణమవుతుంది. దీని ఫలితంగా కాలేయ వైఫల్యం, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేందుకు అవకాశం ఉంది.

అందుకే పుదుచ్చేరిలోని ఈ కాటన్‌ క్యాండీ విక్రయాలను నిషేధిస్తున్నట్లు ‘లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై’ తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో గవర్నర్ తన అధికారిక సోషల్‌ మీడియా పేజీలో దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ షేర్‌ చేశారు. పిల్లల కోసం కాటన్ క్యాండీలను కొనుగోలు చేయడం మానుకోవాలని, అందులోని రసాయనాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని తెలిపారు. కాటన్‌ క్యాండీలు విక్రయించే అన్ని దుకాణాలలో తనిఖీ చేయాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించినట్లు గవర్నర్ ఆ వీడియోలో తెలిపారు. మరి, పిల్లలు ఎంతో ఇష్టంగా తిని కాటన్ క్యాండీలో విష రసాయనాలు ఉపాయోగించటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి