iDreamPost

పీచుమిఠాయిని నిషేధించే దిశగా ఏపీ ప్రభుత్వం.. ఎందుకంటే?

Cotton Candy is Banned in AP: పీచుమిఠాయి అంటే ఇష్టపడని వారు ఉండరు. కానీ ఇటీవల పీచు మిఠాయిలో క్యాన్సర్ కారణాలు ఉన్నాయంటూ పలు రాష్ట్రాలు నిషేదించాయి.

Cotton Candy is Banned in AP: పీచుమిఠాయి అంటే ఇష్టపడని వారు ఉండరు. కానీ ఇటీవల పీచు మిఠాయిలో క్యాన్సర్ కారణాలు ఉన్నాయంటూ పలు రాష్ట్రాలు నిషేదించాయి.

పీచుమిఠాయిని నిషేధించే దిశగా ఏపీ ప్రభుత్వం.. ఎందుకంటే?

సాధారణంగా పీచుమిఠాయి అంటే చిన్న పిల్లలకే కాదు.. పెద్దవాళ్లు కూడా తెగ ఇష్టపడుతుంటారు. గ్రామాలు, నగర వీధుల్లో గంట కొట్టుకుంటూ పీచుమిఠాయిని అమ్ముతుంటారు. ఇవి ఎక్కువగా గులాబీ, తెలుపు రంగులో ఉంటాయి. పీచు మిఠాయి కొనిపిస్తే ఎంత మారాం చేసే పిల్లలైనా గప్ చుప్ అవుతారు. నోరూరించే ఈ పీచు మిఠాయిని ఎన్నో ఏళ్ల నుంచి తింటున్నారు. ఇటీవల పీచు మిఠాయి తినడం వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని తమిళనాడు, పుదుచ్చేరీ రాష్ట్రాలు పూర్తిగా నిషేధించాయి. తాజాగా పీచు మిఠాయిని నిషేదించే దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

పిల్లలు, పెద్దలు ఎంతగానో ఇష్టపడే పీచుమిఠాయి ఇప్పుడు ప్రాణ సంకటంగా మారిందని అంటున్నారు. కొంతమంది స్వార్థంతో పిచుమిఠాయిలో ప్రాణాంతకరమైన రంగులు వాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి అమ్ముతున్న పీచు మిఠాయిపై ఇటీవల తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పీచు మిఠాయిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఏపీలో పీచుమిఠాయి శాంపిల్స్ ను సేకరించి పరీక్షలకు పంపాలని అన్ని జిల్లాల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య, ఆహార భద్రత కమిషనర్ జే నివాస్ మాట్లాడుతూ.. ‘పీచుమిఠాయిలో ఆరోగ్యానికి హానికరం చేసే సింథటిక్ రంగులు వాడుతున్నారని ఆరోపణలు వచ్చాయి, అనుమతి లేని రంగులు వాడటం వల్ల అవి క్యాన్సర్ కు కారణం అవుతున్నాయి. ఇందులో రోడమైన్ బి, మెటానిల్ ఎల్లో వంటి రంగులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. పీచుమిఠాయి శాంపిల్స్ సేకరించి పరీక్షల ప్రక్రియ ప్రారంభించాం, రిజల్ట్ రావడానికి నెల రోజుల సమయం పడుతుంది. రంగులు ఉన్న పీచుమిఠాయి ఆరోగ్యానికి హాని.. వీటిని అపరిశుభ్ర వాతావరణంలో తయారుచేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జాతర్లు జరుగుతున్న ప్రదేశాల్లో వీటి అమ్మకాలు తగ్గించేలా నిర్ణయం తీసుకున్నాం’ అని అన్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి