iDreamPost

పట్టాలు తప్పిన మరో రైలు.. పలు రైళ్లు రద్దు!

పట్టాలు తప్పిన మరో రైలు.. పలు రైళ్లు రద్దు!

కోరమాండల్ రైలు ప్రమాద ఘటన గురించి అందరికి తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో దాదాపు 280 మంది మృతి చెందారు. అలానే వందలాది మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఈ ఘటన అందరిని తీవ్రంగా కలచి వేసింది. ఈ ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజాము తాడి- అనకాపల్లి సమీపంలో సౌత్ సెంట్రల్ రైల్వేకు చెందిన గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.

కోరమాండల్ రైలు ప్రమాదం దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన తరువాత రైలు ప్రమాదానికి  సంబంధించి ఏ ఘటన జరిగిన అందరు ఉల్కిపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా అనకాపల్లి సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. లోక్ పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం బుధవారం తెల్లవారుజామున 3.35 గంటలకు జరిగినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఘటనతో విశాఖపట్నం-విజయవాడ మార్గంలో నడవాల్సిన  పలు రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి.

విశాఖ నుంచి లింగంపల్లి (12805) వెళ్లే జన్మభూమి, విశాఖ నుంచి విజయవాడ (22701) వెళ్లే ఉదయ్ రైలు రద్దయ్యాయి. అలానే విశాఖ-గుంటూరు (17240)- సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు కూడా ఈరోజు రద్దు చేయబడ్డాయి. ఇదే సమయంలో విశాఖ నుంచి సికింద్రాబాద్ (20833) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మూడు గంటలు ఆలస్యంగా నడుస్తుంది. దీంతో పాటు విశాఖపట్నం, దువ్వాడ రైల్వే స్టేషన్లలో పలు రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  మరి..ఇలా వరుస ప్రమాదాలపై మీ అభిప్రాయాలను  కామెంట్స్  రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి