iDreamPost

యువకుల ఆరాధ్య దేవత నిశ్చితార్థం! త్వరలోనే పెళ్లి..

  • Author Soma Sekhar Published - 03:00 PM, Fri - 24 November 23

ఒక్క మూవీతో ఆమె కుర్రాళ్ల హృదయాల్లో ఆరాధ్య దేవతగా స్థానం సంపాదించుకుంది. తాజాగా యూత్ కలలను కొల్లగొడుతూ.. నిశ్చితార్థం చేసుకుంది ఆ బ్యూటీ.

ఒక్క మూవీతో ఆమె కుర్రాళ్ల హృదయాల్లో ఆరాధ్య దేవతగా స్థానం సంపాదించుకుంది. తాజాగా యూత్ కలలను కొల్లగొడుతూ.. నిశ్చితార్థం చేసుకుంది ఆ బ్యూటీ.

  • Author Soma Sekhar Published - 03:00 PM, Fri - 24 November 23
యువకుల ఆరాధ్య దేవత నిశ్చితార్థం! త్వరలోనే పెళ్లి..

వెండితెరపైకి ఎంతో మంది నటీ, నటులు వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారిలో తమదైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసినవారు కొందరు మాత్రమే. వారి నటనకు సినీ లవర్స్ ఫిదా అవుతుంటారు. అలా తన నటనతో తెలుగు ప్రేక్షకుల్లో ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది మీతా రఘునాథ్. భాషతో సంబంధం లేకుండా వచ్చిన ‘గుడ్ నైట్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ప్రత్యేకించి మీతా రఘునాథ్ నటనకు టాలీవుడ్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఈ ఒక్క మూవీతో ఆమె కుర్రాళ్ల హృదయాల్లో ఆరాధ్య దేవతగా స్థానం సంపాదించుకుంది. యూత్ కలల రాణికి తాజాగా ఎంగేజ్ మెంట్ జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ బ్యూటీ.

‘గుడ్ నైట్’ ఎలాంటి అంచనాలు లేకుండా, చిన్న చిత్రంగా విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. నిద్ర, గురక లాంటి సాధారణ విషయాలను కథగా తీసుకున్న డైరెక్టర్ వినాయక్ చంద్రశేఖరన్ అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ చిత్రంలో ఎలాంటి మేకప్ లేకుండా అను పాత్రలో మీతా రఘునాథ్ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. మణికందన్, మీతా రఘునాథ్ జోడీ నటనకు భారీ స్పందన లభించింది. ఈ సినిమాలో మీతా నటనకు ఫిదా అయిన యువకులు.. సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకునేలా చేసింది. భర్త కోసం ఎలాంటి కష్టాలనైనా భరించే భార్యగా మీతా నటన కట్టిపడేసింది.

దీంతో ఈ సినిమా చూసిన కుర్రాళ్లంతా మీతా లాంటి భార్య రావాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ సైతం చేశారు. గుడ్ నైట్ మూవీలో అను పాత్ర ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరి కుర్రాళ్ల మనసు దోచిన ఈ బ్యూటీ తాజాగా ఎంగేజ్ మెంట్ చేసుకుంది. తనకు కాబోయే భర్తతో ఉన్న ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది. త్వరలోనే పెళ్లి డేట్ ప్రకటిస్తామని తెలిపింది. దీంతో యూత్ కలల రాణికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు సినీ ప్రముఖులు, అభిమానులు. కాగా.. 2022లో వచ్చిన ‘సా నీ నిధూమ్ నీ’ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. గుడ్ నైట్ చిత్రంతో వచ్చిన గుర్తింపుతో ఈ బ్యూటీకి కోలీవుడ్ లో భారీగానే ఆఫర్లు వస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Haiku Clickzz (@haiku_clickzz)

 

View this post on Instagram

 

A post shared by Meetha Raghunath (@the.meethling)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి