iDreamPost

పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

వినియోగదారులకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతూ పసిడి ప్రియులను బెంబేలెత్తిస్తున్నాయి. నేడు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఈ రోజు తులం గోల్డ్ రేట్ ఎంతుందంటే?

వినియోగదారులకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతూ పసిడి ప్రియులను బెంబేలెత్తిస్తున్నాయి. నేడు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఈ రోజు తులం గోల్డ్ రేట్ ఎంతుందంటే?

పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

బంగారానికి అన్ని సీజన్స్ లో డిమాండ్ ఉంటుంది. ఏ చిన్న శుభకార్యమైనా పసిడి కొనుగోలు చేస్తుంటారు వినియోగదారులు. ఇప్పుడంతా పెళ్లిల్ల సీజన్ కొనసాగుతోంది. దీంతో గోల్డ్ కొనేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే బంగారం ధరలు మాత్రం ఎప్పుడు తగ్గుతాయో, ఎప్పుడు పెరుగుతాయో అంచనా వేయలేని పరిస్థితి. దీనికి గల కారణం.. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకున్న ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోవడం వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావాన్ని చూపిస్తాయి. కాగా తాజాగా గోల్డ్ ధరలు మళ్లీ పెరిగాయి. పుత్తడి ధరలు అంతకంతకూ పెరుగుతూ పసిడి ప్రియులకు షాకిస్తున్నాయి. ఈ రోజు మార్కెట్ లో తులం బంగారం ధర ఎంత ఉందంటే?

బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిన్న పెరిగిన ధరలకు కొనసాగింపుగా మళ్లీ పసిడి ధర పైకి ఎగబాకింది. దీంతో గోల్డ్ కొనాలనుకునే వారు అయోమయంలో పడిపోయారు. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ బంగారం ధర రూ. 62,890 ఉండగా ఈరోజు(శనివారం) మరో రూ. 110 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.63,000 వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నటి రోజున 10గ్రాములు 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 57,650 చేరుకోగా ఈరోజు(శనివారం) రూ. 100 పెరిగి రూ.57,750 వద్ద అమ్ముడవుతోంది.

ఇక ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 10గ్రాముల 24 క్యారెట్ మేలిమి బంగారం ధర రూ. 63000లు ఉండగా, 10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర రూ. 57,750 వద్ద అమ్ముడవుతోంది. ముంబాయి, బెంగళూరు నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24క్యారెట్ పసిడి ధర రూ. 110 పెరగడంతో రూ. 63150కి చేరుకుంది. అదే విధంగా 10గ్రాముల 22క్యారెట్ గోల్డ్ ధర రూ. 100 పెరిగడంతో రూ. 57900 కి చేరుకుంది.

వెండి ధర

ఇక బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. ఏకంగా కిలో సిల్వర్ పై రూ. 1000 పెరిగింది. హైదరాబాద్‌ లో నిన్నమన్నటి వరకూ 79,500 వద్ద ఉన్న ధరలు.. ఏకంగా కిలోపై రూ. 1000 పెరిగి 80,500 కి చేరింది. విజయవాడలో కూడా కిలో వెండి ధర రూ. 80,500 వద్ద అమ్ముడవుతోంది. చెన్నై నగరంలో రూ. 80,500, ముంబాయిలో రూ. 78,500, బెంగళూరులో రూ. 76,000 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశ రాజధాని హస్తినాలో కిలో వెండి ధర రూ. 78,500 కు చేరుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి