iDreamPost

రెండు రోజుల తర్వాత భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. రెండు రోజులుగా షాకిచ్చిన బంగారం ధరలు నేడు భారీగా దిగివచ్చాయి. గోల్డ్ తో పాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. నేడు తులం బంగారం ధర ఎంత ఉందంటే?

పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. రెండు రోజులుగా షాకిచ్చిన బంగారం ధరలు నేడు భారీగా దిగివచ్చాయి. గోల్డ్ తో పాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. నేడు తులం బంగారం ధర ఎంత ఉందంటే?

రెండు రోజుల తర్వాత భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

గత రెండు రోజులుగా పైపైకి ఎగబాకిన బంగారం ధరలు నేడు దిగొచ్చాయి. వరుసగా పెరిగిన గోల్డ్ రేట్స్ తో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోయారు. పసిడి కొనేందుకు ఆలోచించాల్సిన పరిస్థితి ఉండే నిన్నటి వరకు. కానీ నేడు పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పాలి. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. తులంపై ఏకంగా రూ. 490 తగ్గింది. పుత్తడి ధరలపై అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకున్న ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి మారకం విలువ వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తాయి. దేశ వ్యాప్తంగా శుభకార్యాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో గోల్డ్ కు భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. కొనుగోలు దారులుసైతం బంగారం ధరలు భారీగా తగ్గడంతో ఈ సమయంలో కొనుగోలు చేస్తే లాభాలు పొందొచ్చని నిపుణులు తెలుపుతున్నారు.

బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. కిలో సిల్వర్ ధరపై రూ. 800 వరకు తగ్గింది. కాగా ఇవాళ హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.450 తగ్గింది. దీంతో నిన్న రూ.57,750 ఉన్న ధర నేడు రూ. 57 వేల 300 వద్దకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.490 తగ్గింది. దీంతో నిన్న తులం బంగారం ధర రూ. 63000 ఉండగా.. నేడు తగ్గిన ధరలతో రూ. 62 వేల 510 వద్ద అమ్ముడవుతోంది. ఇక దేశ రాజధాని హస్తినలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 450 తగ్గి రూ. 57 వేల 450 వద్ద ట్రేడవుతోంది. 24 క్యారెట్ల పసిడి తులానికి రూ. 490 తగ్గి రూ. 62 వేల 660 వద్దకు చేరింది. విశాఖపట్నం, విజయవాడలో కూడా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

వెండి రేటు:

ఇక బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టగా వెండి కూడా పసిడి బాటలోనే పయనించింది. కిలో వెండి ధరపై ఏకంగా రూ. 800లు తగ్గింది. ఇవాళ భాగ్యనగరంలో కిలో వెండి ధర రూ. 800 మేర పడిపోయి ప్రస్తుతం రూ. 79 వేల 700 వద్ద అమ్ముడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.800 మేర తగ్గి రూ. 77 వేల 700 వద్ద అమ్ముడవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి