iDreamPost

మ్యాక్స్‌వెల్‌ ఆడుతున్న సమయంలో ఆఫ్ఘాన్‌ బౌలర్లు చేసిన బ్లండర్‌ మిస్టేక్‌ ఇదే..!

  • Author singhj Published - 03:11 PM, Wed - 8 November 23

ఆఫ్ఘానిస్థాన్​పై సంచలన ఇన్నింగ్స్​తో వరల్డ్ కప్​లో జోష్​ను మరింత పెంచేశాడు మ్యాక్స్​వెల్. అయితే అతడు ఆడుతున్న టైమ్​లో ప్రత్యర్థి బౌలర్లు ఒక బ్లండర్ మిస్టేక్ చేశారు.

ఆఫ్ఘానిస్థాన్​పై సంచలన ఇన్నింగ్స్​తో వరల్డ్ కప్​లో జోష్​ను మరింత పెంచేశాడు మ్యాక్స్​వెల్. అయితే అతడు ఆడుతున్న టైమ్​లో ప్రత్యర్థి బౌలర్లు ఒక బ్లండర్ మిస్టేక్ చేశారు.

  • Author singhj Published - 03:11 PM, Wed - 8 November 23
మ్యాక్స్‌వెల్‌ ఆడుతున్న సమయంలో ఆఫ్ఘాన్‌ బౌలర్లు చేసిన బ్లండర్‌ మిస్టేక్‌ ఇదే..!

ఇప్పుడు క్రికెట్ వరల్డ్ మొత్తం గ్లెన్ మ్యాక్స్​వెల్ నామస్మరణ చేస్తోంది. దీనికి కారణం అతడు ఆడిన సంచలన ఇన్నింగ్సే. ఆఫ్ఘానిస్థాన్​ టీమ్​పై ఓటమి కోరల్లో కూరుకున్న ఆస్ట్రేలియాను సింగిల్ హ్యాండెడ్​తో గెలిపించాడు మ్యాక్సీ మామ. నీళ్లు తాగినంత అలవోకగా బౌండరీలు, సిక్సులు బాదాడు. ఇదేం బాదుడు, ఇదేం కొట్టుడు అంటూ బ్యాటింగ్​కు ఫిదా అయిపోయారు ఫ్యాన్స్. నో డౌట్ వరల్డ్ కప్​లోనే కాదు.. మొత్తం వన్డే క్రికెట్ హిస్టరీలోనే ఇది బెస్ట్ ఇన్నింగ్స్ అంటూ మ్యాక్స్​వెల్​ను అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఒకే ఒక్క ఇన్నింగ్స్​తో అందరి మనసులు దోచుకున్న మ్యాక్సీ.. ఎన్నో రికార్డులను కూడా బ్రేక్ చేసి తన పేరు మీద రాసుకున్నాడు.

ఓటమిని ఒప్పుకోని తత్వం, చివరి వరకు పోరాడటం లాంటి ఆసీస్ జీన్స్​ తనలో పుష్కలంగా ఉన్నాయని మరోమారు ప్రూవ్ చేశాడు మ్యాక్స్​వెల్. ఇది అతడి కెరీర్​లోనే బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. 91 పరుగులకే ఏడుగురు బ్యాట్స్​మెన్ పెవిలియన్ చేరుకున్న టైమ్​లో అతడు ఆడిన వీరోచిత ఇన్నింగ్స్​ను ఎంత పొగిడినా తక్కువే. కెప్టెన్ ప్యాట్ కమిన్స్​ను ఒక ఎండ్​లో ఉంచి గెలిపించాల్సిన బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. ఎవడు వేస్తాడో వేయండి బాల్ అంటూ ఆఫ్ఘాన్ బౌలర్లను ఊచకోత కోశాడు. తొడ కండరాలు పట్టేయడం, ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో తీవ్రంగా అలసిపోయినప్పటికీ లెక్కచేయకుండా ఒంటి కాలు మీదే నిలబడి సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టాడు మ్యాక్సీ. అందుకే దీన్ని గొప్ప ఇన్నింగ్స్ అని అందరూ అంటున్నారు.

మ్యాక్స్​వెల్ ఇన్నింగ్స్​ను 1983 వరల్డ్ కప్​లో జింబాబ్వేపై కపిల్ దేవ్ (175 రన్స్) ఇన్నింగ్స్​తో కంపారిజన్ చేస్తున్నారు. ఆ మ్యాచ్​లో కపిల్ మాదిరిగానే నిన్న ఆఫ్ఘాన్​తో మ్యాచ్​లో ఒక్కడే యోధుడిలా నిలబడి మ్యాక్స్​వెల్ గెలిపించాడని ప్రశంసిస్తున్నారు ఫ్యాన్స్. ఆరోగ్యం సహకరించకున్నా, క్రీజులో సరిగ్గా నిలబడలేని పరిస్థితుల్లో కూడా మొండి పట్టుదలతో బ్యాటింగ్ కొనసాగించాడు మ్యాక్స్. ఒంటి కాలు మీదే నిలబడి సిక్సులు కొట్టాడు. అయితే ఈ మ్యాచ్​లో 33 రన్స్ వద్దే అతను ఔట్ కావాల్సింది. మ్యాక్స్​వెల్ ఇచ్చిన ఈజీ క్యాచ్​ను స్పిన్నర్ ముజీబుర్ రెహ్మాన్ వదిలేశాడు. ఒకవేళ ఆ క్యాచ్ పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పొచ్చు. క్యాచ్​తో పాటు మ్యాచ్​ను కూడా చేజార్చాడు ముజీబ్.

మ్యాక్స్​వెల్​ ఆడినది గ్రేట్ ఇన్నింగ్స్ అయినప్పటికీ అతడు ఆఫ్ఘానిస్థాన్​కు కొన్ని ఛాన్సులు ఇచ్చాడు. కానీ దాన్ని వాళ్లు సరిగ్గా వాడుకోలేదు. స్టార్టింగ్​లో మ్యాక్సీ ఇచ్చిన క్యాచ్​ను ముజీబ్ చేజార్చాడు. ఆ తర్వాత కండరాలు పట్టేయడంతో అతను ఒంటి కాలు సపోర్ట్​తోనే బ్యాటింగ్​ కంటిన్యూ చేశాడు. ఒకవేళ ఆ టైమ్​లో యార్కర్లు లేదా ఫ్రంట్ ఫుట్​కు వచ్చి ఆడే విధంగా బాల్స్ సంధించి ఉంటే మ్యాక్సీ ఇబ్బంది పడేవాడు. ఈ క్రమంలో అతడు ఔట్ అవ్వడానికి ఛాన్స్ ఉండేది. కానీ ఆఫ్ఘాన్ స్పిన్నర్లు, పేసర్లు ఆ పని చేయడంలో ఫెయిల్ అయ్యారు.

ఆఫ్ఘానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా కూడా సరిగ్గా ఫీల్డింగ్ సెట్ చేయలేదు. ఒకవేళ వికెట్ కోసం ప్రయత్నించి యార్కర్లు, ఫ్రంట్ ఫుట్ బాల్స్ వేసి.. టైట్ ఫీల్డింగ్ సెట్ చేసి ఉంటే మ్యాక్సీ దొరికిపోయేవాడేమో. కానీ ఆఫ్గాన్ బౌలర్లు బ్లండర్ మిస్టేక్ చేసి మూల్యం చెల్లించుకున్నారు. ఎంతకొద్దీ పరుగులు ఆపడం మీదే దృష్టి పెట్టి మ్యాచ్​ను చేజార్చుకున్నారు. డిఫెన్సివ్ మైండ్​సెట్​ ఆఫ్ఘాన్​ను ఓడించిందని చెప్పొచ్చు. నిలబడి సిక్సర్లు కొడుతున్నప్పుడు ఏదో ఒక విధంగా మ్యాక్స్​వెల్​ను డైవర్ట్ చేయాలనే ఆలోచనే వారిలో కనిపించలేదు. దీన్ని వాడుకున్న ఆసీస్ బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరి.. ఆఫ్ఘాన్ ఓటమికి కారణాలు ఏంటని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: డబుల్ సెంచరీతో గెలిపించినా అసంతృప్తిలో మ్యాక్స్​వెల్.. అలా జరగాల్సిందంటూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి