iDreamPost

అమ్మాయిని పంపుతామంటే ఈ డాక్ట‌ర్ రూ.కోటిన్న‌ర స‌మ‌ర్పించుకున్నాడు

అమ్మాయిని పంపుతామంటే ఈ డాక్ట‌ర్ రూ.కోటిన్న‌ర స‌మ‌ర్పించుకున్నాడు

ఇత‌నో కాస్త ప్రాక్టీస్ ఉన్న‌ డాక్ట‌ర్. కాని ఓ వీక్ నెస్ ఉంది. డేటింగ్ వెబ్ సైట్ల‌లో అమ్మాయిల‌కు గాలం వేయాల‌నుకొంటాడు. జిగోలో వెబ్ సైట్, యాప్ (gigolo dating app)ల్లో డేటింగ్ చేసే అమ్మాయిల కోసం వెతికాడు. అత‌న్ని ప‌సిగ‌ట్టిన సైబ‌ర్ నేర‌గాళ్లు, ముందు అమ్మాయిలా చాట్ చేశారు. ఆ త‌ర్వాత అమ్మాయిని పంపుతామ‌ని డ‌బ్బులు వ‌సూలు చేశారు. అదేదో సినిమాలా…యువ‌తి కోసం అత‌ను వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఇత‌ను అడుగుతున్నాడు. వాళ్లు ఫోటోలు పంపుతున్నారు. మ‌రింత ఇవ్వ‌మ‌ని అడుగుతున్నారు. ఈ డాక్ట‌ర్ ఇస్తూనే ఉన్నాడు. ఇలా ఏకంగా రూ.40ల‌క్ష‌లు దోచుకున్నారు. చివ‌ర‌కు కాస్త బుద్ధి వ‌చ్చి, 2020 అక్టోబ‌ర్ లో సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

అటు పోలీసులు ద‌ర్యాప్తు చేస్తుండ‌గానే, మ‌నోడు మ‌ళ్లీ వేరేవాళ్ళ‌తో కాంటాక్ట్ లోకి వ‌చ్చాడు. మ‌రో రూ.30ల‌క్ష‌లు వాళ్లు చెప్పిన ఎకౌంట్ కు ట్రాన్స‌ఫ‌ర్ చేశాడు. ఈ సంగ‌తి తెలిసి పోలీసుల‌కు చిర్రెత్తుకొచ్చింది. అత‌నికి డేటింగ్ వెబ్ సైట్స్ లో ఎలా మోసాలు చేస్తారో వివ‌రంగా చెప్పారు. నువ్వు మోస‌పోయావ‌ని క్లియ‌ర్ గా చెప్పారు.

కొన్నినెల‌ల‌కు మ‌ళ్లీ ఆ డాక్ట‌ర్ మొద‌టికొచ్చాడు. ఆ అమ్మాయి కావాలా అని నేర‌గాళ్లు అడ‌గ‌గానే మ‌ళ్లీ డ‌బ్బులు పంప‌డం మొద‌లుపెట్టారు. ఇలా ఒక‌సారి కాదు, చాలాసార్లు. ఇలా డేటింగ్ వెబ్ సైట్ లో ఖాతాల‌కు రూ.80ల‌క్ష‌లు పంపించాడు

ల‌క్ష‌లాది డ‌బ్బులు ఎకౌంట్ లోంచి మాయ‌మ‌వుతుండ‌టంతో కుటుంబ స‌భ్యులు అత‌ని ఎకౌంట్ ను చెక్ చేస్తే మొత్తం బండారం బైట‌ప‌డింది.

ఇలా మొత్తం మూడేళ్ల‌లో చాలా అమ్మాయిల ఖాతాల‌కు కోటిన్న‌ర స‌మ‌ర్పించుకున్నాడు. ఒక సైబ‌ర్ నేర‌గాడి ఎకౌంట్ లోనే ఎక్కువ మొత్తం ఉంది. అత‌న్ని ప‌ట్టుకొని ఆ మొత్తాన్ని రాబ‌ట్టే ప‌నిలోఉన్నారు పోలీసులు. మ‌రి డాక్ట‌ర్?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి