iDreamPost

వీడియో: ఆప్యాయంగా పలకరించుకున్న CM రేవంత్, KTR!

Revanth, KTR: రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల నేతలపై ఆరోపణలు చేయడం, ఆగ్రహం వ్యక్తం చేయడమే మనం ఎక్కువగా చూస్తుంటాము. అయితే చాలా అరుదుగా ప్రత్యర్థి పార్టీల నాయకలు మధ్య సరద సన్నివేశాలు చోటుచేసుకుంటాయి. అలాంటిదే తెలంగాణలో జరిగింది.

Revanth, KTR: రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల నేతలపై ఆరోపణలు చేయడం, ఆగ్రహం వ్యక్తం చేయడమే మనం ఎక్కువగా చూస్తుంటాము. అయితే చాలా అరుదుగా ప్రత్యర్థి పార్టీల నాయకలు మధ్య సరద సన్నివేశాలు చోటుచేసుకుంటాయి. అలాంటిదే తెలంగాణలో జరిగింది.

వీడియో: ఆప్యాయంగా పలకరించుకున్న CM రేవంత్, KTR!

రాజకీయాలు అంటే నిత్యం అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటారు. అంతేకాక వ్యక్తిగత విషయాలను కూడా తమ రాజకీయాల్లో మాట్లాడుతుంటారు. అయితే ఇలా కేవలం రాజకీయ రణరంగంలో మాత్రం ఉంటుంది. ప్రత్యేక సందర్భాల్లో రాజకీయ వైరం పక్కన పెట్టి.. పరస్పరం పలకరించుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాక తనదైన పాలనతో  అతి తక్కువ సమయంలోనే ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆరు గ్యారెంటీల్లో .. ఇప్పటికే రెండు గ్యారెంటీలను ప్రారంభించారు. అంతేకాక మిగిలిన స్కీమ్స్ ను కూడా  అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలానే మూడు రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. నేడు శాసన సభ నూతన స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను ఎంపిక కార్యక్రమం జరిగింది.

ఈయన వికారాబాద్  నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన నామినేషన్ పత్రాలను శాసన సభ కార్యదర్శికి  సమర్పించారు. ఇక ఈ సందర్భంగా  ప్రసాద్  కుమార్ వెంట సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కూనంనేని సాంబశిరావు తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ కుమార్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై మాజీ మంత్రి కేటీఆర్ సంతకం చేశారు. గురువారం ఉదయం శాసన సభలో స్పీకర్ ఎన్నిక  నిర్వహించనున్నారు. అనంతరం బయటకు వచ్చే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఆప్యాయంగా పలకరించుకున్నారు.

సరదగా జోకులు వేస్తూ.. కాసేపు సందడి వాతావరణం నెలకొల్పారు. కేటీఆర్ డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్కతో కూడా కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి ఘటనలు రాజకీయాల్లో చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 64  సీట్లు, బీఆర్ఎస్ 39 సీట్లు, బీజేపీ 8, ఎంఐఎం 7 గెలుచుకున్న విషయం తెలిసిందే. ఎందరో ప్రముఖల మధ్యలో ఇలాంటి ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య చోటుచేసుకుంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి