iDreamPost

ఫ్రీ జర్నీ: TSRTC డ్రైవర్‌, కండక్టర్లకు గుడ్‌న్యూస్.. ఇన్సెంటివ్ పెంపు, కానీ వారికి మాత్రమే

  • Published Dec 23, 2023 | 10:02 AMUpdated Dec 23, 2023 | 10:02 AM

TSRTC Incentives: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేయడంతో.. బస్సుల్లో రద్దీ పెరిగింది. ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు

TSRTC Incentives: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేయడంతో.. బస్సుల్లో రద్దీ పెరిగింది. ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు

  • Published Dec 23, 2023 | 10:02 AMUpdated Dec 23, 2023 | 10:02 AM
ఫ్రీ జర్నీ: TSRTC డ్రైవర్‌, కండక్టర్లకు గుడ్‌న్యూస్.. ఇన్సెంటివ్ పెంపు, కానీ వారికి మాత్రమే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్ ముందు ప్రకటించినట్లుగానే.. ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు రెడీ అవుతోంది. అంతేకాక వాటిల్లో ప్రధానమైన మహిలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తోంది. ఈ పథకానికి మహిళల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. బస్సులన్నీ కిక్కిరిసి పోతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉచిత ప్రయాణం అందుబాటులో ఉండటంతో.. చాలా మంది మహిళలు ప్రయాణాలపై ఆసక్తి చూపుతున్నారు. దాంతో ఎక్స్‌ప్రెస్‌, ఆర్డినరీ సర్వీసుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా ఉంటోంది.

ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడంతో.. కొద్దిరోజులుగా ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌-సీట్ల భర్తీ నిష్పత్తి) బాగా పెరిగింది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులో ప్రయాణించేవారిలో దాదాపు 60 శాతం మహిళలే ఉంటున్నారు. రద్దీ పెరగడంతో.. ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు, ట్రిప్పులు నడపాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.ఈ క్రమంలో డ్రైవర్లు, కండక్టర్లు డబుల్‌ డ్యూటీ చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ.. డ్రైవర్లు, కండక్టర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాలు..

incentives increased for drivers and conductors

ఈక్రమంలో డబుల్ డ్యూటీ చేసే డ్రైవర్లు, కండక్టర్లకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ప్రోత్సాహకాలు ఒక రోజుకు- గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో డ్రైవర్లకు రూ.740 నుంచి రూ.900కు పెంచారు. అలానే కండక్టర్లకు రూ.700 నుంచి రూ.850కి, కాంట్రాక్ట్‌ డ్రైవర్లకు రూ.590 నుంచి రూ.720కి, కాంట్రాక్ట్‌ కండక్టర్లకు రూ.510 నుంచి రూ.620కి పెంచుతూ.. ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

అంతేకాక రాష్ట్రంలోని ఇతర రీజియన్లలో డబుల్ డ్యూటీలు చేస్తోన్న డ్రైవర్లకు రూ.600 నుంచి రూ.730కి, కండక్టర్లకు రూ.530 నుంచి రూ.650కు పెంచారు. కాంట్రాక్ట్‌ డ్రైవర్లకు రూ.480 నుంచి రూ.590కి, కాంట్రాక్ట్‌ కండక్టర్లకు రూ.420 నుంచి రూ.510కి పెంచినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయంపై ఆర్టీసీ డ్రైవర్లు, కండెక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి