iDreamPost

రెండో లిస్ట్ ఎఫెక్ట్.. కాంగ్రెస్ కు షాకుల మీద షాకులు! BRSలోకి నాగం జనార్ధన్ రెడ్డి

  • Author Soma Sekhar Published - 07:38 PM, Sat - 28 October 23

ఎప్పుడైతే కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ విడుదల అయ్యిందో.. అప్పటి నుంచి కాంగ్రెస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డవారు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. తాజాగా సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు.

ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా కాంగ్రెస్ 45 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఎప్పుడైతే కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ విడుదల అయ్యిందో.. అప్పటి నుంచి కాంగ్రెస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డవారు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. తాజాగా సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారన్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. నాగర్ కర్నూల్ టికెట్ ను రాజేష్ రెడ్డికి కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో అప్పటి నుంచి ఆయన అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే బీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ ప్రకటించిన రెండో లిస్ట్.. ఆ పార్టీని కుదిపేస్తోంది. పార్టీ టికెట్ దక్కని అసంతృప్తులు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి, సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి సైతం కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ టికెట్ ఆశించి.. భంగపడ్డారు నాగం. దీంతో కాంగ్రెస్ తీరుపై అసహనంతో ఉన్న ఆయన బీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం. ఈ మేరకు అక్టోబర్ 29 సాయంత్రం మంత్రి కేటీఆర్ నాగం ఇంటికి వెళ్లనున్నారని సమాచారం.

ఈ క్రమంలోనే కేటీఆర్ ఆయన్ను కలిసి మర్యాదపూర్వంగా పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు రాజకీయ వర్గాలు తెలుపుతున్నాయి. దీంతో మరో రెండో రోజుల్లో నాగం జనార్థన్ రెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే టికెట్ ఆశించిన సుభాష్ రెడ్డి, కూకట్ పల్లి నియోజకవర్గం టికెట్ ఆశించిన గొట్టిముక్కల వెంగళ్ రావు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. త్వరలోనే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు. అయితే పార్టీ మారే నేతల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి