iDreamPost

ఓటమితో కుంగిపోవద్దు.. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవ్వండి: KTR

KTR: వచ్చే ఏడాదిలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు చెందిన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సోమవారం నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

KTR: వచ్చే ఏడాదిలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు చెందిన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సోమవారం నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఓటమితో కుంగిపోవద్దు.. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవ్వండి: KTR

మరికొద్ది నెలల్లో దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల్లో కూడా మరోసారి ఎన్నికల వాతావరణం కనిపించనుంది. ఇక పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో అన్ని పార్టీలు వ్యూహాలు ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణంలో అధికారంలో కోల్పోయిన బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు.

సోమవారం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వచ్చే లోక్ సభ ఎన్నికల సన్నద్ధత, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. ఈ క్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ..లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, అందుకు స‌మాయ‌త్తం కావాల‌ని పార్టీ నేతలను ఆయన ఆదేశించారు. అసెంబ్లీల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాల‌ని తెలిపారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల  పార్లమెంట్ లో నాలుగు నియోజకవర్గాల్లో లక్ష తొమ్మిది వేల మెజార్టీ వచ్చిందని కేటీఆర్ తెలిపారు. అంతేకాక ఈ భారీ మెజార్టీని కాపాడుకుంటూ లోక్ సభ ఎన్నికలకు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని ఆయన తెలిపారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఎవరూ కుంగిపోవద్దని, పరాజయం చెందిన బీఆర్ఎస్‌ అభ్యర్థులే నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లని ఆయన స్పష్టం చేశారు. ఆ ఇంఛార్జులే  ఆయా నియోజకవర్గాల్లో విస్త్రృతంగా పర్యటించాలని తారక రామరావు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి పార్టీ సమీక్ష సమావేశాలు జరుగుతాయని నేతలకు తెలిపారు.

అంతేకాక జనవరి 3ను ప్రారంభించి 26లోగా సమావేశాలు పూర్తి చేసుకోవాలని నేతలకు సూచించారు. ఇక ఈ సమీక్ష సమావేశం అనంతరం  చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడారు. తనను చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా మరోసారి పోటీ చేయమని కేటీఆర్‌ చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని స్థానిక నేతలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్‌ఎస్‌ ఏం చేయలేదని, పార్టీ ఖాళీ అవుతుందని కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు  చేస్తున్న అసత్య ప్రచారాన్ని గట్టిగా తిప్పికొడతామని ఆయన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయిన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెడతామని పార్టీ శ్రేణులకు రంజిత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. మరి.. పార్టీ సమావేశంలో నేతలను ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి