iDreamPost

Vijay Deverakonda’s Kushi పవన్ టైటిల్ తో విజయ్ దేవరకొండ

Vijay Deverakonda’s Kushi పవన్ టైటిల్ తో విజయ్ దేవరకొండ

పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఖుషి టైటిల్ తో ఉన్న కనెక్షన్ అంతా ఇంతా కాదు. అప్పట్లో ఇది సృష్టించిన రికార్డులకు బాక్సాఫీసులు బద్దలైపోయాయి. ఒక సింపుల్ ప్రేమకథతో ఆ స్థాయిలో వసూళ్ల ఊచకోత చేయడం ఒక్క పవన్ కళ్యాణ్ కు మాత్రమే సాధ్యమయ్యిందని ఆ టైంలో మీడియా కథనాలు చాలా వచ్చాయి. అందుకే ఆ ఎవర్ గ్రీన్ క్లాసిక్ వచ్చి ఇరవై ఏళ్ళు దాటుతున్నా దాని తాలూకు వైబ్రేషన్స్ ని అభిమానులు ఇంకా ఫీలవుతూనే ఉంటారు. అంత ప్రత్యేకత సంతరించుకున్న ఖుషి పేరుని విజయ్ దేవరకొండ తీసేసుకున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ లవ్ ఎంటర్ టైనర్ ఫస్ట్ లుక్ ఇందాక విడుదల చేశారు.

ఇందులో మొదటిసారి సమంతా విజయ్ దేవరకొండకు ఫుల్ లెన్త్ జోడిగా నటిస్తోంది. ఇప్పటికే కీలక భాగం చిత్రీకరణ పూర్తి చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 23 విడుదల తేదీని ప్రకటించడం విశేషం. దానికి దగ్గరలో అవతార్ 2 ఉన్నప్పటికీ యూనిట్ సాహసం చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఇందులో జయరాం, సచిన్ కెడ్కర్, మురళి శర్మ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు ఇతర తారాగణం. మల్లువుడ్ ఫేమ్ హిషామ్ అబ్దుల్ వాహబ్ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు. మురళి ఛాయాగ్రహణం సమకూరుస్తుండగా కన్నడ, మలయాళం, తమిళంలో కూడా రిలీజ్ చేయబోతున్నారు

ఈ లెక్కన విజయ్ దేవరకొండ రెండు సినిమాలు ఈ సంవత్సరంలో రాబోతున్నాయి. ఆగస్ట్ 25న లైగర్ వస్తుండగా కేవలం నాలుగు నెలల గ్యాప్ లో ఖుషిని తీసుకొస్తారు. ఇది ఫ్యాన్స్ కి కిక్కిచ్చే వార్తే. వరల్డ్ ఫేమస్ లవర్ టైంలో అసలు ప్రేమకథలే చేయనని చెప్పిన విజయ్ దేవరకొండ తన ఒట్టుని తీసి గట్టున పెట్టేసి ఖుషి కోసం మళ్ళీ లవ్ స్టోరీనే తీసుకున్నారు. ఢిల్లీ కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఖుషితో తన ఇమేజ్ బ్యాలన్స్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు రౌడీ బాయ్. దీని తర్వాత పూరి జగన్నాధ్ జనగణమన రెగ్యులర్ షూట్ కు వెళ్తుంది. సుకుమార్ ప్రాజెక్టు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి