iDreamPost

విశాఖ ఘటన మరువక ముందే.. మరో భారీ అగ్నిప్రమాదం!

వైజాగ్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం గురించి అందరికి తెలిసిందే. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. తాజాగా మరో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్లాస్టిక్ తయారీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

వైజాగ్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం గురించి అందరికి తెలిసిందే. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. తాజాగా మరో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్లాస్టిక్ తయారీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

విశాఖ ఘటన మరువక ముందే.. మరో భారీ అగ్నిప్రమాదం!

ఈ మధ్యకాలంలో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి.  షార్ట్ సర్యూట్ , రసాయానాల పేలుడు వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక ఈ ప్రమాదాల్లో ఎందరో అమాయకులు సజీవ దహనం అవుతున్నారు. మరెందరో కాలిన గాయాలతో  జీవితాన్ని దుర్భరంగా గడుపుతున్నారు. ఇక ఈ అగ్నిప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. ఆదివారం వైజాగ్ లోని షిపింగ్ హార్బర్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదం గురించి అందరికి తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు  50 బోట్లు కాలిపోయాయి. అంతేకాక కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఈ ఘటన మరువక ముందే తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు అందించి సమాచారం ప్రకారం..

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌర ప్రాంతంలో ప్లాస్టిక్ తయారీ కంపెనీ ఉంది. ఈ కంపెనీ  జన ఆవాసలా మధ్య ఉంది. చుట్టు అనేక మంది జనాలు నివస్తున్నారు. మంగళవారం ఈ ప్లాసిట్ తయారీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీ ఎత్తున ఎగసి పడుతున్నాయి. దీంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. ఈ భారీ మంటల ధాటికి దట్టమైన నల్లటి పొగలు ఆ ప్రాంతాన్ని కప్పేశాయి. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. నివాస ప్రాంతాల్లో ఈ కంపెనీ ఉంటంతో  స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటనేది తెలియరాలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి