iDreamPost

బైక్ ఢీ కొనడంతో అగ్నిప్రమాదం.. బస్సు దగ్ధం

బైక్ ఢీ కొనడంతో  అగ్నిప్రమాదం.. బస్సు దగ్ధం

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు  చోటుచేసుకుంటాయి. షార్ట్ సర్కూట్, రసాయనాల పేలుడు, ఇంధనం లీకేజ్ వంటి కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.  ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అంతే కాకా చాలా మంది తీవ్రమైన గాయాలతో జీవితాన్ని నరకంగా అనుభవిస్తున్నారు. అలానే వాహనాల్లో కూడా అగ్నిప్రమాదాలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లోని ఓ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.  పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని వరదరాజపురానికి చెందిన సంపత్ కుమార్(26) అనే యువకుడు యూజే ఫార్ములా కంపెనీలో పని చేస్తున్నాడు. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో విధులకు హాజరయ్యేందుకు తన బైక్ పై వెళ్తుండగా.. మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట్ మండలంలని జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో  ప్రమాదానికి గురైంది.  కొల్తూరు సమీపంలో జాతీయ రహదారిపై తుర్కపల్లి నుంచి ఎదురుగా వస్తున్న ఓ ఫార్మా కంపెనీకి చెందిన బస్సును  ఈ బైక్  ఢీ కొట్టింది.  ఈ ఘటనలో సంపత్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.

అలానే ఈ ప్రమాదంలో బైక్ పెట్రోల్ ట్యాంక్ లీకై మంటలు చెలరేగాయి.  ఆ మంటలు కాస్తా బస్సుకు అంటుకున్నాయి.  ప్రమాదాన్ని గుర్తించి బస్సులోని  వారు వెంటనే కిందకు దిగిపోయారు. క్షణాల్లోనే బస్సుకు నలువైపుల మంటలు అంటుకున్నాయి. అనంతరం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమచారం. మరి.. ఇలాంటి ప్రమాదాల నివారణకు మీ సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒ‍క్కసారిగా బస్సు టైరు పేలటంతో..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి