iDreamPost

కుర్చీలతో చితక్కొట్టేసుకున్న IIT విద్యార్థులు.. వీడియో వైరల్

  • Published Oct 09, 2023 | 12:50 PMUpdated Oct 09, 2023 | 12:50 PM
  • Published Oct 09, 2023 | 12:50 PMUpdated Oct 09, 2023 | 12:50 PM
కుర్చీలతో చితక్కొట్టేసుకున్న IIT విద్యార్థులు.. వీడియో వైరల్

ఇటీవల ప్రతి చిన్న విషయానికి కొంతమంది తీవ్రమైన మనస్థాపానికి గురై ఎదుటి వారిపై దాడులు చేస్తున్నారు. కొన్నిసార్లు క్షణికావేశంలో హత్యలకు పాల్పపడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా విద్యార్థులు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు జరగడం సహజం. కొన్నిసార్లు ఆలాంటి గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి పెద్దది కావడంతో కళాశాల యాజమాన్యాలు జోక్యం చేసుకొని  గొడవలు సర్ధుమణిగేలా చేస్తుంటారు. వార్షిక క్రీడా వారాత్సోవాల్లో చిన్న గొడవ పెద్దగా మారి ఐఐటీ విద్యార్థుల మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘటన కాన్పూర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెలితే..

కాన్పూర్ లోని ఐఐటీ కాలేజ్ లో శనివారం వార్షిక క్రీడా ఉత్సవంలో భాగంగా జరిగిన కబడ్డీ పోటీలో చిన్న వివాదం చెలరేగడంతో విద్యార్థుల మధ్య గొడవల మొదలయ్యాయి. కొంతమంది విద్యార్థులు రెచ్చిపోయి కుర్చీలతో కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు దారుణంగా దాడులు చేసుకున్నారు.. పిడిగుద్దులు కురిపించుకున్నారు. విద్యార్ధుల గొడవతో అక్కడే ఉన్న కొంతమంది అమ్మాయిలు భయంతో అటూ ఇటూ పరుగులు తీస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ గొడవ వైఎంసీఏ- ఎన్ఎస్‌యూటీ జట్ల మధ్య జరిగినట్లు సమాచారం. అయితే గొడవకు గల స్పష్టమైన కారణాలు మాత్రం తెలియరాలేదు.

ఇక కాన్పూర్ లో ఐఐటీ విద్యార్థుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో షోషల్ మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. ప్లేయర్లు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడం, ముష్టిఘాతాలకు పాల్పపడటం లాంటి బీభత్సాలు వీడియోలో కనిపిస్తున్నాయి. ఈ గొడవలో అక్కడ ఫర్నీచర్లు ధ్వంసం అయ్యాయి.. దాంతొ పాటు పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందించినట్లు తెలుస్తుంది. కాగా, గొడవకు దిగిన ఇరు జట్లు కాన్పూర్ వెలుపలివి కావడం గమనార్హం. ఈ గొడవ తర్వాత రెండు జట్లపై అనర్హత వేటు వేసినట్లు తెలుస్తుంది. కాకపోతే ఈ ఘటనపై కాన్పూరు ఐఐటీ అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి