iDreamPost
android-app
ios-app

కుమారుడి 18వ బర్త్‌ డేకి తండ్రి కోట్లు విలువ చేసే గిఫ్ట్!

  • Published Apr 11, 2024 | 10:25 PM Updated Updated Apr 11, 2024 | 10:25 PM

పుట్టిన రోజుకు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి సంతోష పెట్టడం చూస్తూనే ఉంటాము. కానీ ఓ తండ్రి మాత్రం తన కొడుకు కోట్లు విలువ చేసే గిఫ్టును అందించి ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇంతకీ ఏం గిఫ్ట్ ఇచ్చాడంటే?

పుట్టిన రోజుకు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి సంతోష పెట్టడం చూస్తూనే ఉంటాము. కానీ ఓ తండ్రి మాత్రం తన కొడుకు కోట్లు విలువ చేసే గిఫ్టును అందించి ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇంతకీ ఏం గిఫ్ట్ ఇచ్చాడంటే?

కుమారుడి 18వ బర్త్‌ డేకి తండ్రి కోట్లు విలువ చేసే గిఫ్ట్!

ప్రస్తుత రోజుల్లో పుట్టిన రోజు వేడుకలు అందరూ జరుపుకుంటున్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బర్త్ డే అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఓ స్పెషల్ డేనే కదా. అలాంటి ప్రత్యేకమైన రోజును మరింత ప్రత్యేకంగా మలచాలని తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తుంటారు. బర్త్ డేలకు గిఫ్టులు ఇవ్వడం సాధారణమే. ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు బహుమతులను ప్రజెంట్ చేస్తుంటారు. అయితే ధనవంతులు మాత్రం కాస్ల్టీ గిఫ్టులతో ఆశ్చర్యపరుస్తుంటారు. ఇదే విధంగా ఓ బిజినెస్ మ్యాన్ తన కుమారుడి 18వ బర్త్ డే సందర్భంగా కోట్లు విలువ చేసే గిఫ్ట్ ను అందించి ప్రపంచాన్నే సర్ ప్రైజ్ చేశాడు.

ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలే ప్రపంచం. వారి కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. వారి భవిష్యత్తు కోసం జీవితాన్ని ధారపోస్తారు. పిల్లల సంతోషమే తమ సంతోషంగా భావిస్తుంటారు. ఈ క్రమంలో ఓ తండ్రి తన కొడుకుపై ఎనలేని ప్రేమను చాటుకున్నాడు. కొడుకు బర్త్ డే సందర్భంగా ఐదు కోట్లు విలువ చేసే కారును బహుమతిగా అందించాడు. తండ్రి ఇచ్చిన గిఫ్టును చూసి ఆ కుమారుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఆ తండ్రి మరెవరో కాదు యూఏఈలో ఉండే భారత వ్యాపారవేత్త వివేక్ కుమార్ రుంగ్తా. తన కుమారుడి తరుష్ రుంగ్తాకు లంబోర్ఘిని కారు అంటే చాలా ఇష్టమని, అందుకే అతని 18 వ పుట్టిన రోజు గిఫ్ట్‌ కింద రూ.5 కోట్ల విలువైన లంబోర్ఘిని హురాకాన్ ఎస్టీఓ మోడల్ కారును అందించినట్లు వెల్లడించాడు. లంబోర్ఘిని హురాకాన్ ఎస్టీఓ కారు ఎక్స్ షోరూమ్ ధర అక్షరాలా రూ. 4.99 కోట్లు.

సాధారణంగా బర్త్ డేలకు కార్లు, బైక్ లు ఇవ్వడం చూస్తూనే ఉంటాము. కానీ ఐదు కోట్లు విలువ చేసే కారును 18 ఏళ్ళ వయసున్న కొడుకుకు అందించడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. తన బర్త్ డేకు తన తండ్రి లంబోర్ఘిని హురాకాన్ ఎస్టీఓ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన వీడియోను తరుష్ రుంగ్తా తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. కారు కొనుగోలు దగ్గర్నుంచి కేక్ కట్ చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతోంది. తన తండ్రి అందించిన విలువైన గిఫ్ట్ పట్ల తరుష్ రుంగ్తా స్పందిస్తూ.. లంబోర్ఘిని హురాకాన్ ఎస్టీఓ కారును గిఫ్ట్‌గా ఇవ్వడం చాలా స్పెషల్ అని పేర్కొన్నాడు. వారి ప్రేమ, మద్దతు ఎల్లప్పుడూ తనకు ఉందనడానికి ఇదే నిదర్శనమని తెలిపాడు.

 

View this post on Instagram

 

A post shared by Tarush Rungta (@tarushrungta)

gamdomCasibomJojobet Girişjojobet girişmarsbahis girişGrandpashabet Giriş