iDreamPost

F3 Movie : రిలీజ్ డేట్ చెప్పగానే సరిపోదుగా

F3 Movie : రిలీజ్ డేట్ చెప్పగానే సరిపోదుగా

కరోనా వల్ల ఆగుతూ సాగుతూ జరిగిన ఎఫ్3 షూటింగ్ ఎట్టకేలకు పూర్తయ్యింది. నిన్న దిల్ రాజు టీమ్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించి తారాగణమంతా ఉన్న ఒక చిన్న వీడియో బిట్ ని పోస్ట్ చేసింది. అందులో విడుదల తేదీని ఏప్రిల్ 28ని మరోసారి కన్ఫర్మ్ చేసింది. అయితే సోషల్ మీడియాలో ఇచ్చిన మెసేజ్ లో మాత్రం ముందో వెనకో థియేటర్లో రావడం పక్కా అని క్లారిటీ ఇచ్చింది. అంటే ఆ డేట్ కి కట్టుబడటం ఇతర సినిమాల మీద ఆధారపడి ఉంటుందని చెప్పకనే చెప్పింది. ఆల్రెడీ ఆ తేదీని ఆర్ఆర్ఆర్ రెండు ఆప్షన్లలో ఒకటిగా లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 18 రాకపోతే ఏప్రిల్ 28 ఖచ్చితంగా వచ్చే తీరాలి.

ఒకవేళ అదే జరిగితే ఎఫ్3 దానికన్నా ముందు లేదా మే నెలకి షిఫ్ట్ అవుతుంది. ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు ఇదే మాట అన్నారు. నిర్మాతలంతా మాట్లాడుకుని అడ్జస్ట్ చేసుకుంటామని, ఒకవేళ పాన్ ఇండియా మూవీ వస్తే తాను సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సో ఎఫ్3 గురించి అప్పుడే కంక్లూజన్ కు రాలేం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన ఈ ఫన్ ఎంటర్ టైనర్ లో ఈసారి సునీల్ లాంటి ఆకర్షణలు అదనంగా తోడయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంతో సహా మిగిలిన టీమ్ మొత్తం ఫస్ట్ పార్ట్ కి పని చేసినవాళ్ళే ఉండబోతున్నారు. క్యాస్టింగ్ కూడా కంటిన్యూ అవుతోంది.

మూడేళ్ళ క్రితం విపరీతమైన పోటీలో వచ్చిన బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన ఎఫ్2కి కొనసాగింపుగా దీని మీద ఫాన్స్ కు భారీ అంచనాలు ఉన్నాయి. వెంకటేష్ ని పెద్దతెరపై చూసేందుకు అభిమానులు ఎదురు చూస్తున్నారు. నారప్ప, దృశ్యం 2 రెండూ డైరెక్ట్ ఓటిటిలో వచ్చినందుకు వాళ్ళు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈసారి మాత్రం సిల్వర్ స్క్రీన్ ఖరారయ్యింది. పరిస్థితులు ఎలా ఉన్నా ఎఫ్3 బృందం సోలో రిలీజ్ కే మొగ్గు చూపుతోంది. కాకపోతే కరోనా వల్ల అందరి ప్లానింగ్ తలకిందులు అయ్యింది. సో ఏదో ఒక కాంపిటీషన్ లేకుండా పెద్ద సినిమాలు రిలీజయ్యే సీన్ లేదు. చూడాలి మరి ఎఫ్3 ఎప్పుడు నవ్వుల్లో ముంచెత్తనుందో

Also Read : Duvvada Jagannadham : బాలీవుడ్ వెళ్తున్న దువ్వాడ జగన్నాథం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి