iDreamPost

గ్యాస్‌ సిలిండర్‌కి ఎక్స్‌పైర్‌ డేట్‌ ఉంటుందని తెలుసా.. ఎలా చెక్‌ చేయాలంటే

  • Published Nov 23, 2023 | 3:10 PMUpdated Nov 23, 2023 | 3:10 PM

సాధారణంగా మనం వాడే ప్రతి దానికి ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. అలానే గ్యాస్‌ సిలిండర్‌కు కూడా కాలపరిమితి ఉంటుంది. అయితే చాలా మందికి ఈ విషయం తెలియదు. మరి గ్యాస్‌ సిలిండర్‌ ఎక్స్‌పైర్‌ డేట్‌ను ఎలా చెక్‌ చేయాలంటే..

సాధారణంగా మనం వాడే ప్రతి దానికి ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. అలానే గ్యాస్‌ సిలిండర్‌కు కూడా కాలపరిమితి ఉంటుంది. అయితే చాలా మందికి ఈ విషయం తెలియదు. మరి గ్యాస్‌ సిలిండర్‌ ఎక్స్‌పైర్‌ డేట్‌ను ఎలా చెక్‌ చేయాలంటే..

  • Published Nov 23, 2023 | 3:10 PMUpdated Nov 23, 2023 | 3:10 PM
గ్యాస్‌ సిలిండర్‌కి ఎక్స్‌పైర్‌ డేట్‌ ఉంటుందని తెలుసా.. ఎలా చెక్‌ చేయాలంటే

నేటి కాలంలో గ్యాస్‌ వినియోగం కనీస అవసరాల్లో భాగంగా మారింది. గ్యాస్‌ వచ్చాక మహిళలకు పని భారం చాలా వరకు తగ్గింది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా బీపీఎల్‌ కుటుంబాలకు సబ్సిడీ కింద తక్కువ ధరకే గ్యాస్‌ అందిస్తున్నాయి. ఇక కొన్ని రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగానికి వాడే గ్యాస్‌ ధర తగ్గించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే.. రూ.400లకే గ్యాస్‌ ఇస్తామని బీఆర్‌ఎస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్యాస్‌ వినియోగం తప్పనిసరి అయిన నేటి కాలంలో.. వాడకం సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు.

సాధారణంగా మనం వాడే ప్రతి దానికి ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. అలానే గ్యాస్‌ సిలిండర్‌కు కూడా కాలపరిమితి ఉంటుంది. అయితే చాలా మందికి ఈ విషయం తెలియదు. ఎవరూ గమనించరు కూడా. కానీ ఎక్స్‌పైరీ తేదీ దాటిన గ్యాస్‌ సిలిండర్‌ వాడితే పెనుప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఎక్స్‌పైరీ తేదీ దాటిన గ్యాస్‌ సిలిండర్‌ వాడితే.. లీకయ్యే ప్రమాదం ఉంటుందంటున్నారు.

అంతేకాక గ్యాస్‌ కంపెనీలు డెలివరీ చేసే ప్రతి సిలిండర్‌ మీద ఎక్స్‌పైరీ సంవత్సరం, నెలకు సంబంధించిన కోడ్‌ని మెటల్‌ ప్లేట్‌పై ముద్రిస్తాయని చెబుతున్నారు. కనుక సిలిండర్‌ మారుతున్నప్పుడల్లా ఎక్స్‌పైరీ గడువును చూసుకుని తీసుకోవడం, వినియోగించుకోవడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

ఎక్స్‌పైర్‌ డేట్‌ని ఎలా గుర్తించాలంటే..

సిలిండర్‌ మెటల్‌ ప్లేటుపై ఆంగ్ల అక్షరంతో సంవత్సరం, నెల ఉంటుంది. దాని ప్రకారం అది ఏ సంవత్సరం, ఏ నెల తరువాత ఎక్స్‌పైరీ అవుతుందో తెలుస్తుంది. ఉదాహరణకు మీ సిలిండర్‌ మెటల్‌ ప్లేట్‌ మీద ఎ–24అని ఉంది అనకొండి.. ఆ సిలిండర్‌ 2024 మార్చిలో ఎక్స్‌పైర్‌ అవుతుందని అర్థం. ఇక్కడ ఆంగ్ల అక్షరం త్రైమాసికానికి సూచిక. ఎ అక్షరం జనవరి-మార్చి వరకు, బి అక్షరం ఏప్రిల్‌-జూన్‌ వరకు, సి అక్షరం జూలై-ప్టెంబరు వరకు, డి అక్షరం అక్టోబర్‌-డిసెంబరు వరకు అని గుర్తించాలి.

Gas cilynder expiry date

సిలిండర్‌ ఇంటి వద్దకు వచ్చిన వెంటనే మెటల్‌ ప్లేట్‌పై కోడ్‌ విధానంలో ఉండే ఎక్స్‌పైరీ గడువును పరిశీలించాలి. అది నెల రోజులకు సమీపంలో ఉంటే అలాంటి సిలిండర్‌ను తీసుకోకూడదు. చిన్నచిన్న కుటుంబాలవారు, అతి తక్కువ వేతనం సంపాదించేవారు గ్యాస్‌ వినియోగం ఎక్కువ రోజులు చేస్తుంటారు. కనుక ఎక్స్‌పైరీ తేదీ లోపల వారి సిలిండర్‌ పూర్తయ్యే అవకాశాలు తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున అటువంటి సిలిండర్లతో ప్రమాదం సంభవించే అవకాశం అధికంగా ఉంటుంది. కనుక కాలపరిమితిని గుర్తించి సిలిండర్‌ తీసుకోవాలి. దానిస్థానంలో వేరే సిలిండర్‌ అడిగే హక్కు వినియోగదారునికి ఉంది అంటున్నారు నిపుణులు.

సిలిండర్‌కు పదేళ్ల గడువు..

సిలిండర్‌ తయారైన నాటి నుంచి పదేళ్ల వరకు దానికి గడువు ఉంటుంది. సిలిండర్‌ను ప్రత్యేకమైన ఉక్కుతో, లోపల భాగం సురక్షితమైన కోటింగ్‌తో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌(బీఐఎస్‌) ప్రమాణాలతో తయారుచేస్తారు. బీఐఎస్‌ అనుమతుల తరువాతే సిలిండర్‌ మార్కెట్‌లోకి వస్తుంది. అలానే గ్యాస్‌ తీసుకునే ముందే ఎక్స్‌పైర్‌ డేట్‌ని పరిశీలించి తీసుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. కనుక జాగ్రత్తగా ఉండండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి