iDreamPost

సినిమాలంటే ఇంత పిచ్చా.. ఏకంగా IAS ఉద్యోగం వదిలేసి!

  • Author ajaykrishna Updated - 02:31 PM, Thu - 5 October 23
  • Author ajaykrishna Updated - 02:31 PM, Thu - 5 October 23
సినిమాలంటే ఇంత పిచ్చా.. ఏకంగా IAS ఉద్యోగం వదిలేసి!

డ్రీమ్స్ కోసం ఎలాంటి రిస్క్ అయినా చేసేవాళ్ళు ఉంటారు. లైఫ్ లో ప్యాషన్ వేరు.. సాధించేది వేరు అన్నట్లుగా కొందరి జీవితాలలో మార్పులు జరుగుతుంటాయి. కష్టపడి సాధించిన దానితో సరిపెట్టుకోవడం ఒక రకం. ఆల్రెడీ సాధించిన దాన్ని పక్కన పెట్టి.. ఇంకో గోల్ కోసం పరుగులు తీయడం మరో రకం. కానీ.. ఉన్నతమైన పదవిని వదిలేసి.. కోరుకున్న దాని వైపు అడుగులు వేయడం ఒక్కోసారి పిచ్చి అనిపిస్తుంది. బట్.. జనాలు ఏం అనుకుంటున్నారు అనేది కాదు.. అది సాధించేవాడికి ఏం అనిపించింది అనేది పాయింట్. ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ పక్కన పెట్టి.. సినిమాల్లోకి వచ్చిన ఓ వ్యక్తి గురించి ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి.

ఉత్తరప్రదేశ్ కి చెందిన ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్.. ఎంతో కష్టపడి ఐఏఎస్ ఉద్యోగం సొంతం చేసుకున్నాడు. కట్ చేస్తే.. కొన్నాళ్ళకు సినిమాలపై ఇంటరెస్ట్ తో ఉద్యోగానికి రాజీనామా చేసి సంచలనం సృష్టించాడు. అరెరే.. మంచి లైఫ్ వదులుకున్నాడే అని వినేవాళ్ళకు అనిపించవచ్చు. కానీ.. అతని నిర్ణయాన్ని ఉన్నతఅధికారులు ఓకే చేశారు. కట్ చేస్తే.. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఢిల్లీ క్రైమ్ సీజన్ 2’ వెబ్ సిరీస్ లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా మెరిశాడు అభిషేక్. అందులో అతని క్యారెక్టర్ కి మంచి మార్కులు కూడా పడ్డాయి. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు ప్రముఖ ఫ్యాషన్ షోస్ లో మోడల్ గా రాణిస్తున్నాడు.

2011 బ్యాచ్‌ కి చెందిన ఐఏఎస్‌ అధికారిగా భాద్యతలు తీసుకున్న తర్వాత.. అభిషేక్ పలు వివాదాలను ఫేస్ చేశారు. 2015లో ఉత్తరప్రదేశ్ నుండి డిప్యూటేషన్ పై ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. గతేడాది గుజరాత్ ఎన్నికల టైమ్ లో కూడా సర్వీస్ లో ఉన్నాడు అభిషేక్. తాను ఎన్నికల బాధ్యతలు తీసుకున్నట్లు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. దీంతో చట్ట విరుద్ధం అని.. ఎన్నికల డ్యూటీ నుండి అభిషేక్ ని ఈసి సస్పెండ్ చేసింది. కట్ చేస్తే.. ఇటీవల తాను ఐఏఎస్ అధికారి హోదాకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు అభిషేక్. ఒక్కసారిగా అందరు షాక్ అయిపోయారు. ఏంటి.. ఐఏఎస్ జాబ్ వదులుకొని ఏం చేస్తాడని అన్నారు. కానీ.. సినిమాల ప్యాషన్ ఉందిగా. అభిషేక్ భార్య శక్తి నాగపాల్ కూడా ఐఏఎస్ అధికారి కావడం విశేషం.

కోవిడ్ సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొన్న అభిషేక్.. ఎన్నో శిబిరాలు నిర్వహించి అవసరాలు తీర్చారు. సేవా కార్యక్రమాలలో అభిషేక్ కి మంచి పేరుంది. తర్వాత అభిషేక్ ‘చార్ పంద్రా’ అనే షార్ట్ ఫిల్మ్ చేశాడు. టి సిరీస్ ప్రొడ్యూస్ చేసిన ఈ ఫిల్మ్ లో అభిషేక్ నటుడిగా తన మార్క్ చూపించాడు. అలాగే అభిషేక్ పలు ప్రైవేట్ ఆల్బమ్స్ లో నటించాడు. అంతేగాక సోషల్ మీడియాలో అభిషేక్ కి 5 మిలియన్స్ కి పైగా ఫాలోయర్స్ ఉండటం విశేషం. కాగా.. రీసెంట్ గా గణేష్ ఉత్సవాల సందర్బంగా బాలీవుడ్ స్టార్స్ తో ఫోటోలు దిగి పోస్ట్ చేశారు. ప్రస్తుతం అభిషేక్ లైఫ్ స్టోరీ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి మాజీ ఐఏఎస్ అధికారి కం యాక్టర్ అభిషేక్ సింగ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి