iDreamPost

నీటిలో తేలిన ఎవర్ గివెన్ నౌక !

నీటిలో తేలిన ఎవర్ గివెన్ నౌక !

ఈజిప్ట్ యొక్క సూయజ్ కాలువలో చిక్కుకుపోయిన పెద్ద కార్గో షిప్ – ఎవర్ గివెన్ దాదాపు వారం తర్వాత తిరిగి మళ్ళీ నీటి మీద తేలింది. దీంతో మళ్లీ సుయిజ్ కాలవలో రాకపోకలు ప్రారంభమయ్యాయి.

ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే జలమార్గం నుంచి అది తప్పుకోనుందని రాయిటర్స్ తెలిపింది. 400 మీటర్ల పొడవు ( 1,312 అడుగులు ) మరియు 200,000 టన్నుల బరువు , గరిష్టంగా 20,000 కంటైనర్ల సామర్థ్యం కలిగిన ఎవర్ గివెన్ ప్రస్తుతం 18,300 కంటైనర్లను తీసుకువెళుతుంది. చైనా నుంచి నెదర్లాండ్స్ వెళ్తున్న ఈ నౌక చిక్కుపడిన తర్వాత రోజుకు సుమారు 70 వేల కోట్లకు పైగా ప్రపంచ వాణిజ్యానికి నష్టం వచ్చింది.

అయితే బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం ఓడ మళ్లీ తేలినా సరే ఈ జలమార్గం నుండి ఎంత త్వరగా ట్రాఫిక్ క్లియర్ చేస్తారో తెలియదు. 450 కి పైగా నౌకల లాగ్ జామ్ ను క్లియర్ చేయడానికి ఎంత సమయం పడుతుందో వెంటనే తెలియదని ఆ నివేదిక పేర్కొంది .

ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే జలమార్గమైన ఈజిప్టు సూయజ్ కాలువలో ‘ ఎవర్ గివెన్ ‘ అనే పెద్ద కంటైనర్ ఇరుక్కు పోయింది . ఎంపైర్ స్టేట్ భవనం అంత ఎత్తుగా ఉన్న ఈ ఓడ , బలమైన గాలులు , ఇసుక తుఫాను కారణంగా ఇరుక్కుందని సూయజ్ కెనాల్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఆ మార్గంలో భారీ ఓడ వల్ల ఆగిపోయిన ఇతర సరుకు రవాణా ఓడలను క్రమంగా ఒకటి తర్వాత ఒకటిగా ఎలాంటి రద్దీ లేకుండా పంపేందుకు సుయిజ్ కాలువ అథారిటీ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తుంది. అంతేకాకుండా భవిష్యత్తులోనూ మోడల్ ఏవీ కాలువలో ఆగిపోకుండా తగిన చర్యలు తీసుకునేందుకు కాలువ ఆధారిటీ తగు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి