iDreamPost

2023 ప్రపంచ కప్ లో హాట్ ఫేవరెట్ టీమిండియానే: వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్

  • Author Soma Sekhar Published - 12:49 PM, Wed - 2 August 23
  • Author Soma Sekhar Published - 12:49 PM, Wed - 2 August 23
2023 ప్రపంచ కప్ లో హాట్ ఫేవరెట్ టీమిండియానే: వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్

2023 వరల్డ్ కప్ మహా సంగ్రామం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి ప్రపంచ దేశాల క్రికెట్ జట్లు. ఇక మాజీ క్రికెటర్లు, క్రీడా పండితులు వరల్డ్ కప్ జట్లను ప్రెడిక్షన్ ఇవ్వడం ప్రారంభించారు కూడా. మరికొంతమంది మాజీ ఆటగాళ్లు ప్రపంచ కప్ లో ఏ జట్టు హాట్ ఫేవరెటో చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే గత వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 2023 వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ టీమిండియానే అంటూ కితాబిచ్చాడు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

మరికొన్ని రోజుల్లో విశ్వ సమరానికి తెరలేవనుంది. 2023 వరల్డ్ కప్ ఇంకొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ లు తలపడబోతున్నాయి. ఇక ఇప్పటి నుంచే వరల్డ్ కప్ పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు మాజీ క్రికెటర్లు, దిగ్గజ క్రికెటర్లు. ఏ జట్టు వరల్డ్ కప్ ఫేవరెటో, ఏ టీమ్ ప్రపంచ కప్ గెలుస్తుందో తమ అభిప్రాయాలను వెల్లిబుచ్చుతున్నారు ఒక్కొక్కరుగా. తాజాగా వరల్డ్ కప్ 2023లో హాట్ ఫేవరెట్ జట్టు టీమిండియానే అని చెప్పుకొచ్చాడు ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్, గత వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్ తో ముచ్చటించిన మోర్గాన్ తన అభిప్రాయాన్ని తెలియపరిచాడు.

”2023 ప్రపంచ కప్ జట్లలో హాట్ ఫేవరెట్ జట్టు టీమిండియానే, 2011లో ధోని సిక్స్ కొట్టి వరల్డ్ కప్ ను ముద్దాడిన క్షణాలు మళ్లీ వెనక్కి తిప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆ అద్భుతమైన క్షణాల్ని ఎవరూ మర్చిపోలేదు” అంటూ చెప్పుకొచ్చాడు ఇయాన్ మోర్గాన్. కాగా.. గత ప్రపంచ కప్ విన్నింగ్ కెప్టెన్ అయ్యుండి, సొంత జట్టును ఫేవరెట్ టీమ్ అనకుండా.. టీమిండియాను 2023 వరల్డ్ కప్ ఫేవరెట్ జట్లలో ఒకటి అని చెప్పి మోర్గాన్ ఆశ్చర్యపరిచాడు. మరి మోర్గాన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: విండీస్ పై విజయం.. టీమిండియా అరుదైన ఘనత! ప్రపంచంలోనే ఏకైక జట్టుగా..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి