iDreamPost

IND vs ENG: బజ్‌బాల్‌ బెండుతీసిన భారత బౌలర్లు! తక్కువ స్కోర్‌కే ఇంగ్లండ్‌ ఆలౌట్‌

హైదరాబాద్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా బౌలర్లు దుమ్మురేపారు. బజ్ బాల్ స్ట్రాటజీ అంటూ వచ్చిన ప్రత్యర్థిని బెండుతీసిఆరేశారు.

హైదరాబాద్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా బౌలర్లు దుమ్మురేపారు. బజ్ బాల్ స్ట్రాటజీ అంటూ వచ్చిన ప్రత్యర్థిని బెండుతీసిఆరేశారు.

IND vs ENG: బజ్‌బాల్‌ బెండుతీసిన భారత బౌలర్లు! తక్కువ స్కోర్‌కే ఇంగ్లండ్‌ ఆలౌట్‌

బజ్ బాల్.. గత కొంతకాలంగా క్రికెట్ ప్రపంచంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. దానికి కారణం ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్. వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లతో జరిగిన టెస్ట్ సిరీస్ ల్లో ఈ బజ్ బాల్ స్ట్రాటజీని యూజ్ చేసింది ఇంగ్లాండ్ టీమ్. ఇదే స్ట్రాటజీని టీమిండియాతో జరగబోయే 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లోనూ కొనసాగిస్తామని కొంతమంది ఆటగాళ్లు ప్రగల్భాలు పలికారు. కానీ తొలి టెస్ట్ లోనే బజ్ బాల్ స్ట్రాటజీ తుస్సుమన్నది. వరల్డ్ క్లాస్ బౌలింగ్ దళం ఉన్న టీమిండియా ముందు ఏ బాల్ స్ట్రాటజీ కూడా వర్కౌట్ అవ్వలేదు. దీంతో 246 పరుగులకే తోక ముడిచింది ఇంగ్లాండ్ జట్టు.

హైదరాబాద్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా సత్తా చాటుతోంది. తొలి రోజు పూర్తి ఆధిపత్యం చెలాయించారు భారత బౌలర్లు. బజ్ బాల్ క్రికెట్ తో టీమిండియాకు చుక్కలు చూపిస్తామని ప్రగల్బాలు పలికిన ఇంగ్లాండ్ ఆటగాళ్ల బెండుతీశారు భారత బౌలర్లు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లీష్ టీమ్.. బజ్ బాల్ ఆటకు తగ్గట్లుగానే స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించింది. ముఖ్యంగా ఓపెనర్ బెన్ డకెట్ ఫోర్లతో భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. దీంతో 11.5 ఓవర్లలో 55 పరుగులు చేసింది.

అయితే ప్రమాదకరంగా మారుతున్న జాక్ క్రావ్లే(20), బెన్ డకెట్(35) జోడీని అశ్విన్ విడగొట్టాడు. ఆ తర్వాత వచ్చిన ఓలీ పోప్(1) వచ్చీరాగానే జడేజా బౌలింగ్ లో రోహిత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో జాగ్రత్తగా ఆడటం ప్రారంభించింది ప్రత్యర్థి టీమ్. కానీ టీమిండియా స్పిన్ త్రయం అశ్విన్, జడేజా, అక్షర్ ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు నిలవలేకపోయారు. స్పిన్ ఆడటంలో సిద్దహస్తులుగా పేరుగాంచిన ఇంగ్లాండ్ ప్లేయర్లకే తమ గింగిరాలు తిరిగే బంతులతో కళ్లు బైర్లు కమ్మేలా చేశారు మన స్పిన్నర్లు. దీంతో బజ్ బాల్ ఆట చూపిస్తామన్న ఆటగాళ్లు కాస్త.. 246 పరుగులకే తోకముడిచారు.

ఇక ఇంగ్లాండ్ టీమ్ లో కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒక్కడే 70 పరుగులతో రాణించాడు. ఇక ఈ మ్యాచ్ లో మరో విశేషం ఏంటంటే? ప్రత్యర్థి బ్యాటర్లలో ఏ ఒక్క ఆటగాడు కూడా 100 స్ట్రైక్ రేట్ ను దాటలేకపోయాడు. టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు అనడానికి ఇదే నిదర్శనం. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్(29), బెయిర్ స్టో(37), టామ్ హార్ట్లే(23) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అశ్విన్, జడేజాలు తలా 3 వికెట్లు పడగొట్టగా.. అక్షర్, బుమ్రా తలా రెండు వికెట్లు తీశారు. మరి బజ్ బాల్ అంటూ విర్రవీగిన ఇంగ్లాండ్ టీమ్ బెండు తీసిన టీమిండియాపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి