iDreamPost

వైరల్ వీడియో: 4 అడుగుల స్థలంలో.. మూడు అంతస్థుల భవనం

నేడు జనాభా బాగా పెరిగిపోయింది. అవసరాలు కూాడా అభివృద్ధి చెందాయి. మనం, సామాన్లు తలదాచుకునేందుకు ఇల్లు అనేది ఒకటి ఉండాలి. దీంతో ప్రతి ఒక్కరు సొంతింటి కోసం కలలు కంటుంటారు. అయితే నేడు పెరుగుతున్న ఖర్చులకు, వస్తున్న రాబడికి బేరీజు వేసుకుని ఉన్నంతలో ఇంటిని నిర్మించుకుంటున్నారు.

నేడు జనాభా బాగా పెరిగిపోయింది. అవసరాలు కూాడా అభివృద్ధి చెందాయి. మనం, సామాన్లు తలదాచుకునేందుకు ఇల్లు అనేది ఒకటి ఉండాలి. దీంతో ప్రతి ఒక్కరు సొంతింటి కోసం కలలు కంటుంటారు. అయితే నేడు పెరుగుతున్న ఖర్చులకు, వస్తున్న రాబడికి బేరీజు వేసుకుని ఉన్నంతలో ఇంటిని నిర్మించుకుంటున్నారు.

వైరల్ వీడియో: 4 అడుగుల స్థలంలో.. మూడు అంతస్థుల భవనం

పల్లెటూళ్లు నగరాలు అవుతున్నాయి. నగరాలు.. పట్టణాలుగా, పట్టణాలు.. మెట్రో సిటీస్‌గా రూపాంతరం చెందుతున్నాయి. జనాభా పెరుగుతోంది. వారి కనీస అవసరాలు కూడు, గూడు, తిండి, నిద్ర వంటివి తీర్చుకునేందుకు ఓ ఇల్లు అనేది కంపల్సరీ. కానీ నేడు పట్ణణాల్లో, మెట్రో నగరాల్లో ఖాళీ జాగా దొరకడం కష్టంగా మారింది. కొందామంటే గజం స్థలానికి కూడా లక్షలు చెబుతున్నారు. దీంతో అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చేసింది. కాస్తంత స్థలంలోనే ఆకాశాన్ని తాకే భవంతులు కట్టేస్తున్నారు. గ్రేటర్ కమ్యూనిటి పేరుతో చిన్న చిన్న స్థలాల్లోనే 50 అంతస్థుల బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు. ఇవి కూడా కోట్లల్లో ధరలు పలుకుతుండటం గమనార్హం.

కానీ ఇప్పుడు నెట్టింట్లో కొన్ని ఇల్లు చూస్తుంటే.. వారెవ్వా అనిపించడమే కాదూ.. ఆ ఇంజనీర్‌కు సలాం కొట్టాలనిపిస్తోంది. చాలా చిన్న స్థలంలోనే అగ్గిపెట్టెంత ఇల్లు కట్టి అబ్బుపరుస్తున్నారు. కేవలం 4 అంటే నాలుగు అడుగుల స్థలంలో మూడు అంతస్తుల ఇంటిని నిర్మించారు. అందులో ఈ ఇంట్లో అన్ని సదుపాయాలు ఉండటం విశేషం. పైకి ఎక్కేందుకు మెట్లు కూడా ఉన్నాయి. వెంటిలేషన్ కోసం కిటీకిలు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ఫోటో కనిపిస్తున్న ఆ రెండు ఇళ్లు ఆ కోవకు చెందినవే.  ఈ ఇళ్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వీటిని చూశాక ఇంత చిన్న స్థలంలో ఎలా కట్టగలిగారు అంటూ సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓ ఇంట్లో అయితే ఏకంగా.. షాపులు కూడా కట్టేశారు. రెండు అడుగుల స్థలంలో షాపులు కట్టేసినట్లు తెలుస్తోంది. అయితే వీటిని ఎలా కట్టార్రా బాబూ అనుకుంటూనే.. భయం కూడా వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. భూకంపం వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఈ భవంతుల పరిస్థితి ఏంటో అని ప్రశ్నిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Rashid Khan (@rk_khan_facts)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి