iDreamPost

అధికారుల నిర్లక్ష్యం.. కరెంట్‌ స్తంభంపై ఉండగా..

అధికారుల నిర్లక్ష్యం.. కరెంట్‌ స్తంభంపై ఉండగా..

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. కరెంట్‌ షాక్‌ తగిలి ఓ ఎనర్జీ అసిస్టెంట్ మృతి చెందాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కాటూరి వారిపాలెం గ్రామానికి చెందిన అలవలా నారాయణ స్వామి (30) పొందాలి మండలం కొండాయిపాలెం సచివాలయంలో పని చేస్తున్నాడు. ఇతడికి పొదిలి మండలం సలకనూతల గ్రామానికి చెందిన రమాదేవితో వివాహం అయింది. ఈ దంపతులకు ఏడాది వయసు ఉన్న కొడుకు ఉన్నాడు. కంబాలపాడు ఎనర్జీ అసిస్టెంట్ లేకపోవడంతో నారాయణ స్వామి ఆ పనులు కూడా చూసుకుంటున్నాడు.

అదే పనిలో భాగంగా కంబాలపాడు నుంచి ఓబుళక్కపల్లికి వెళ్లే దారిలో కరెంటు వైర్లకి సంబంధించిన విద్యుత్ లైన్ పని కోసం వెళ్లాడు. అదే క్రమంలో విద్యుత్ స్థంభం ఎక్కి పని చేస్తుండగా కరెంటు షాక్ తలిగి కింద పడిపోయాడు. అక్కడిక్కకడే మృతి చెందాడు. నారాయణ స్వామి మృతితో భార్య – బంధువులు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్వామి చనిపోయాక కూడా అధికారులు సంఘటనా స్థలానికి రాలేదని అంటున్నారు.

మృతుడి భార్య – బంధువులు కలిసి పోలీస్ స్టేషన్, ఆసుపత్రి వద్ద నిరసన వ్యక్తం చేశారు. నారాయణ స్వామి భార్య, బంధువులు కలిసి… విద్యుత్ శాఖ అధికారులు తమ పని కాకుండా ఇతరుల పని కూడా చేయాలని ఒత్తిడి చేస్తారంటూ.. సచివాలయంలో పని చేసే ఎనర్జీ అసిస్టెంట్.. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. అధికారుల ఒత్తిడి కారణంగానే నారాయణ స్వామి మరణించాడని ఆందోళన వ్యక్తం చేసారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియచేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి