iDreamPost

MLC స్థానాల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల!

Telangana MLC: ఒక నెల క్రితమే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ ఎలక్షనల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అవి ముగిసి నెల తిరగక ముందే.. మరో ఎన్నికలకు నోటిఫికేషన్ కి విడుదలైంది.

Telangana MLC: ఒక నెల క్రితమే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ ఎలక్షనల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అవి ముగిసి నెల తిరగక ముందే.. మరో ఎన్నికలకు నోటిఫికేషన్ కి విడుదలైంది.

MLC స్థానాల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల!

ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముగిసిన సంగతి తెలిసిందే. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆ తరువాత సింగరేణి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసింది. తాజాగా ఎమ్మెల్యే కోటాల ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ స్థానాల ఉపఎన్నికలకు అసెంబ్లీ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాలీ అయిన సంగతి తెలిసింది. రెండు కూడా టీఆర్ఎస్ కి చెందిన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ఉన్న స్థానాలు. వీరిద్దరు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నుంచి కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో తన ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. అదే విధంగా హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఆయన ఎమ్మెల్యేగా గెలవక ముందు వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎమ్మెల్యే కోటాలు వీరిద్దరిని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసింది. తాజాగా వీరిద్దరు ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో.. ఖాళీ అయిన ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది.

కాగా, రెండు సీట్లకూ విడివిడిగానే ఎన్నికలు జరగనున్నాయి అధికారుల తెలిపారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ కార్యాలయం వేర్వేరుగానే నోటిఫికేషన్లను జారీ చేసింది. నేటి నుంచే నామినేష్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని అందులో పేర్కొంది. ఈ జనవరి 18 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అదేవిధంగా19న నామినేష్ల పరిశీలన, 22 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈ నెల 29న పోలింగ్‌ జరగనుంది. అదేరోజున ఫలితాలు వెలువడనున్నాయి. అయితే రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తుండటంతో సంఖ్యాబలం దృష్ట్యా అధికార కాంగ్రెస్‌ పార్టీకే ఆ సీట్లు దక్కనున్నాయి. అదే విధంగా స్థానిక సంస్థల కోటాల ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరి.. తాజాగా ఎమ్మెల్సీ నోటిపికేషన్ తో తెలంగాణ అసంబ్లీలో ఎన్నికల వాతావరణం కనిపించనుంది. మరి..అభ్యర్థులు ఎవరు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి