iDreamPost

Duleep Trophy 2023: అనామక ఆటగాడు అనుకున్నారు.. కానీ, తొమ్మిదో నంబర్ లో వచ్చి విధ్వంసకర సెంచరీ..

  • Author Soma Sekhar Published - 05:00 PM, Thu - 29 June 23
  • Author Soma Sekhar Published - 05:00 PM, Thu - 29 June 23
Duleep Trophy 2023: అనామక ఆటగాడు అనుకున్నారు.. కానీ, తొమ్మిదో నంబర్ లో వచ్చి విధ్వంసకర సెంచరీ..

ఏ వ్యక్తికైనా తనదైన రోజంటూ వస్తే.. ఆ వ్యక్తిని ఆపటం ఎవరితరమూ కాదు. అలా ప్రతి రంగంలో తమకంటూ ఓ రోజు వస్తుందని ఎదురుచూస్తుంటారు చాలా మంది. మరి క్రికెట్ లో అలాంటి రోజే ఆ వ్యక్తికి వస్తే.. బౌలర్, బ్యాటర్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా అలాంటి రోజే KKR బౌలర్ కు వచ్చింది. బౌలర్ అన్నా కాబట్టి వికెట్లు తీశాడని అనుకుంటే.. మీరు పొరబడినట్లే. ఈసారి ఈ బౌలర్ బాల్ తో కాకుండా బ్యాట్ తో చెలరేగాడు. అతడి విధ్వంసం ధాటికి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపించాయి. ఇప్పుడు చెప్పిన విధ్వంసాన్నంత తొమ్మిదో నంబర్ లో వచ్చిన బౌలర్ చేశాడంటే మీరు నమ్ముతారా? ఆ బౌలర్ పేరే హర్షిత్ రాణా.

హర్షిత్ రాణా.. 21 ఏళ్ల ఈ కుర్రాడ్ని 2022 ఐపీఎల్ మెగా వేలంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన ఇతడు.. ఐపీఎల్ లో 8 మ్యాచ్ లు ఆడి 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అనామక ఆటగాడిగా కొనసాగిన హర్షిత్ రాణా.. ఒక్కసారిగా చెలరేగిపోయాడు. దులీప్ ట్రోఫీ-2023లో భాగంగా.. రెండో క్వార్టర్ ఫైనల్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో నార్త్ జోన్ జట్టు నార్త్ ఈస్ట్ జోన్ జట్టుతో తలపడుతోంది. నార్త్ జోన్ జట్టుకు హర్షిత్ రాణా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఈ క్రమంలోనే తొమ్మిదో నంబర్ లో బ్యాటింగ్ కు వచ్చిన అతడు రికార్డు సెంచరీ నమోదు చేశాడు. కేవలం 86 బంతుల్లో 12 ఫోర్లు, 9 సిక్సర్లతో 122 పరుగులు సాధించాడు. దాంతో నార్త్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్ ను 540/8 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన నార్త్ ఈస్ట్ జోన్ 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే వర్షం రావడంతో.. రెండో రోజు ఆటకు అంతరాయం కలిగింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి