iDreamPost
android-app
ios-app

వీడియో: ఇంట్లోకి కుక్క వచ్చిందని 100కు డయల్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

  • Published May 28, 2024 | 8:07 PMUpdated May 28, 2024 | 8:07 PM

అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు 100కు డయల్ చేయడం తెలిసిందే. సమాచారం అందిన క్షణాల్లోనే అక్కడికి పోలీసులు చేరుకొని ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటారు.

అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు 100కు డయల్ చేయడం తెలిసిందే. సమాచారం అందిన క్షణాల్లోనే అక్కడికి పోలీసులు చేరుకొని ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటారు.

  • Published May 28, 2024 | 8:07 PMUpdated May 28, 2024 | 8:07 PM
వీడియో: ఇంట్లోకి కుక్క వచ్చిందని 100కు డయల్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

డయల్ 100 గురించి తెలిసిందే. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ నంబర్​కు కాల్ చేస్తే చాలు.. నిమిషాల వ్యవధిలోనే పోలీసులు రెక్కలు కట్టుకొని వాలిపోతుంటారు. అత్యవసర సమయాల్లో బాధితులను ఆదుకునేందుకు ఈ టోల్ ఫ్రీ నంబర్​ సేవల్ని ఏర్పాటు చేశారు. 100కు కాల్ చేసి సమాచారం అందిస్తే పోలీసులు వెంటనే రంగంలోకి దిగుతారు. వీలైనంత త్వరగా చర్యలు తీసుకొని బాధితులకు సత్వర న్యాయం అందిస్తున్నారు. పోలీసుల వైపు నుంచి తక్షణ స్పందన ఉండటంతో ఈ నంబర్​కు కాల్ చేసే వారి సంఖ్య పెరిగింది. కొందరు ఆకతాయిలు, పోకిరీలు దీన్ని అదనుగా తీసుకొని పోలీసులను ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. చిన్న సమస్యలకు కూడా 100కు కాల్ చేయడం ఎక్కువైపోయింది.

తాజాగా ఓ వ్యక్తి 100కు డయల్ చేశాడు. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటన సరిగ్గా ఎక్కడ జరిగిందో తెలియదు గానీ సమాచారం అందగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తీరా చూస్తే.. అతడి ఇంట్లో కుక్క దూరిందట. తన ఇంట్లోకి కుక్క వచ్చిందని, దాన్ని తరిమేయాలని పోలీసులను కోరాడా వ్యక్తి. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు.. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీశారు. గేటుకు తాళం వేసుకోవాలని, ఇలా కాల్ చేయడం కరెక్ట్ కాదని.. తమ విలువైన సమయాన్ని వృథా చేయొద్దని పోలీసులు కోరారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్​గా మారింది.

ఈ వీడియోపై సోషల్ మీడియలో నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు పోలీసులు చెప్పిన దాంట్లో తప్పు లేదని, చిన్న వాటికి కూడా వాళ్లను పిలవడం కరెక్ట్ కాదని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం ఆ వ్యక్తి చేసిన దాంట్లో తప్పు లేదని, కుక్క కరుస్తుందేమోననే భయంతో పోలీసులను పిలిచాడని కామెంట్స్ చేస్తున్నారు. వీధి కుక్కల బెడదను తగ్గించాలని మరికొందరు నెటిజన్స్ కోరుతున్నారు. మరి.. ఇంట్లోకి కుక్క దూరిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈ ఘటన మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి