iDreamPost

వెంకన్న మహిమ.. 650 కి.మీ పాదయాత్ర చేస్తూ తిరుమలకు చేరుకున్న శునకం!

పాదయాత్ర అనేది సర్వసాధారణంగా వినిపించే పదం. రాజకీయాల్లో అయితే కాస్తా ఎక్కువగా వినిపిస్తుంది. ఇక భక్తులు కూడా ఈ యాత్ర చేస్తూ దేవుళ్లను దర్శించుకుంటారు. కానీ శునకం కూడా వీరి జాబితాల్లో చేరింది.

పాదయాత్ర అనేది సర్వసాధారణంగా వినిపించే పదం. రాజకీయాల్లో అయితే కాస్తా ఎక్కువగా వినిపిస్తుంది. ఇక భక్తులు కూడా ఈ యాత్ర చేస్తూ దేవుళ్లను దర్శించుకుంటారు. కానీ శునకం కూడా వీరి జాబితాల్లో చేరింది.

వెంకన్న మహిమ.. 650 కి.మీ పాదయాత్ర చేస్తూ తిరుమలకు చేరుకున్న శునకం!

పాదయాత్ర.. ఈ పేరు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది అనేక రకాలుగా ఉంటుంది. రాజకీయ పాదయాత్ర, భక్తితో స్వామి కోసం చేసే పాదయాత్ర.. ఇలా పలు రకాలుగా ఉంటుంది. అయితే ఇలా కేవలం మనషులు మాత్రమే పాదయాత్రలు చేసిన ఘటనలు అనేకం జరిగాయి. అయితే తాజాగా ఓ మూగ జీవి కూడా పాదయాత్ర చేసింది. అది కూడా ఏకంగా 650 కి.మీ చేసి.. తిరుమల చేరుకుంది. ఇది చూసిన అందరూ.. అంతా వెంకన్న మహిమే అంటున్నారు. మరి..ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసకుందాం..

కలియుగ దైవం తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడిని  దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక భక్తులు వివిధ మార్గాల్లో తిరుమలకు చేరుకుని.. స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు. కొందరు వాహనాల్లో రాగా, మరికొందరు పాదయాత్ర చేస్తూ తిరుమల చేరుకుంటారు. అయితే తిరుమల వెంకన్నకు మనుషులు మాత్రమేనా భక్తులు.. తాను కూడా, ఆయన భక్తుడినేనని నిరూపించింది ఓ శునకం. తిరుమలేశుని దర్శనం కోసం ఏకంగా.. 650 కిలో మీటర్లు నడిచి తిరుమలకు చేరుకుంది.

Walking 650 km to Tirumala!

కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లి ప్రాంతానికి చెందిన మంజునాథ్ రెడ్డి శ్రీవారికి భక్తుడు. అవకాశం దొరికిన ప్రతిసారీ తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. అలానే వైకుంఠ ఏకాదశి సందర్భంగా కాలినడక తిరుమలకు పాదయాత్రగా వస్తానని మొక్కుకున్నాడు. అందులో భాగంగానే డిసెంబర్ 2వ తేదీన హబ్లీ నుంచి మంజునాథ్ రెడ్డి బృందం పాదయాత్రగా బయల్దేరింది. అయితే వారి పాదయాత్ర మొదలైన తొలి రోజు వారితో ఓ శునకం కలిసింది. వారితో పాటు నడుచుకుంటూ వెళ్లింది. ఇక మంజునాథ్ రెడ్డి వాళ్లు తినే సమయంలో దానికి కూడా ఆహారం అందించే వాళ్లు.  అంతేకాక బిస్కెట్లు, ఇండ్లీలను ఆహారంగా అందించారు.

తొలిరోజు మొదలకుని హుబ్లి నుంచి తిరుమల వరకూ ఆ శునకం.. మంజునాథ్ రెడ్డి వాళ్ల బృందంతో ప్రయాణం చేసింది. శ్రీవారి భక్తుల్లో కలిసిపోయిన ఈ శునకం.. వారితో కలిసి తిరుమలకు చేరుకుంది. మరోవైపు పాదయాత్రగా తిరుమలకు రావటం ఇది మూడోసారని మంజునాథరెడ్డి చెబుతున్నారు. ఈ శునకం తమను అనుసరిస్తూ తిరుమల వరకు రావడం దేవుడి మహిమేనని మంజునాథ్ రెడ్డి బృందం చెబుతున్నారు. పాదయాత్రలు  ఎన్ని జరిగిన కూడా ఇలా మూగ జీవి రావడం అనేద  అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దేవుడి మహిమతోనే ఇది సాధ్యమైందని ఆ శునకం గురించి తెలుసుకున్న వారు అభిప్రాయ పడుతున్నారు. మరి.. ఈ అద్భుతమైన దృశ్యంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి