iDreamPost

హెల్మెట్స్ పెట్టుకుంటే వల్ల బట్టతల వస్తుందా? నిపుణులు ఏమి చెప్తున్నారు?

  • Published Feb 22, 2024 | 4:18 PMUpdated Feb 22, 2024 | 4:23 PM

ఇప్పుడున్న యూత్ లో చాలా మంది బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్స్ ధరించడానికి ఇష్టపడడం లేదు. హెల్మెట్ ధరించడం వలన జుట్టు రాలిపోతుందని, బట్టతల వస్తుందని ఇలా రకరకాల కారణాలు చెబుతున్నారు. మరి దీనిలో ఎంతవరకు నిజం ఉంది. దీని గురించి నిపుణులు ఏం చెప్తున్నారు అనే విషయాలను తెలుసుకుందాం.

ఇప్పుడున్న యూత్ లో చాలా మంది బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్స్ ధరించడానికి ఇష్టపడడం లేదు. హెల్మెట్ ధరించడం వలన జుట్టు రాలిపోతుందని, బట్టతల వస్తుందని ఇలా రకరకాల కారణాలు చెబుతున్నారు. మరి దీనిలో ఎంతవరకు నిజం ఉంది. దీని గురించి నిపుణులు ఏం చెప్తున్నారు అనే విషయాలను తెలుసుకుందాం.

  • Published Feb 22, 2024 | 4:18 PMUpdated Feb 22, 2024 | 4:23 PM
హెల్మెట్స్ పెట్టుకుంటే వల్ల బట్టతల వస్తుందా? నిపుణులు ఏమి చెప్తున్నారు?

ప్రపంచంలో ఎక్కడైనా సరే ట్రాఫిక్ రూల్స్ ప్రకారం హెల్మెట్ ధరించడం కంపల్సరీ. ఈ రూల్స్ ని ఎవరైనా అధిగమిస్తే దానికి తగిన జరిమానాలు కూడా విధిస్తు ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. అయితే, వారు ఎంత చెప్తున్నాసరే.. చాలా మంది హెల్మెట్ పెట్టుకోకుండానే డ్రైవ్ చేస్తూ ఉంటారు. కారణాలు అడిగితే మాత్రం .. హెల్మెట్ పెట్టుకోవడం వలన జుట్టు రాలిపోతుందని , బట్టతల వస్తుందని ఇలా రకరకాల రీజన్స్ చెబుతూ ఉంటారు. ముఖ్యంగా యూత్ ఇలాంటి కారణాల వలన హెల్మెట్స్ ధరించకుండా డ్రైవ్ చేస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరి, నిజంగా హెల్మెట్ ధరించడం వలన జుట్టు రాలిపోయి.. బట్టతల వస్తుందా ! అసలు నిపుణులు దీని గురించి ఏం చెప్తున్నారు! అనే విషయాలను తెలుసుకుందాం.

హెల్మెట్ ధరించడం వలన జుట్టు రాలిపోవడం, బట్టతల రావడం లాంటివి అన్ని అపోహలే అని.. నిపుణులు తేల్చి చెప్తున్నారు. డ్రైవ్ చేసేటపుడు హెల్మెట్ ధరించడం వలన.. లాభాలే కానీ నష్టాలు లేవని చెబుతున్నారు. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం హెల్మెట్ ధరించడం అనేది కేవలం .. వాహనదారుని రక్షణ కోసమే కానీ.. దాని వలన ఎటువంటి నష్టం లేదు. కానీ, మరి బిగుతుగ ఉండే హెల్మెట్స్ కాకుండా..తలకు సరిపడా హెల్మెట్ ను ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, లాంగ్ డ్రైవ్ చేసేవాళ్ళు .. మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుని .. హెల్మెట్స్ తీస్తూ ఉంటే సరిపోతుందని చెబుతున్నారు. కాబట్టి జుట్టు రాలడం, బట్ట తల రావడానికి .. హెల్మెట్ ధరించడానికి ఎటువంటి సంబంధం లేదని .. నిపుణులు తేల్చి చెబుతున్నారు. కాబట్టి ఇప్పటివరకు ఇలాంటి అపోహలో ఉన్న వారు దాని నుంచి బయటకు వచ్చి.. హెల్మెట్ ధరించడం వలన ప్రాణహాని జరగకుండం ఉంటుంది.

ఇంకా జుట్టు రాలడం , బట్టతల రావడం విషయానికొస్తే.. హార్మోన్లలో ఒక్కసారిగా ఛాంజెస్ రావడం. ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉండడం వలన కూడా జుట్టు రాలిపోతూ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఒక్కసారిగా జుట్టు రాలిపోతే మాత్రం .. ఖచ్చితంగా డాక్టర్స్ ను సంప్రదించాల్సి వస్తుంది. సమయానికి తినడం, నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వలన.. వీటి నుంచి కాస్త ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా కుదుళ్లపై ఎప్పటికపుడు తగినంత శ్రద్ద వహించడం వలన కూడా .. వాటిని ఆరోగ్యాంగా ఉంచుకోవచ్చు . కాబట్టి జుట్టు రాలడం, బట్టతల రావడానికి హెల్మెట్ కారణం కాదని నిపుణులు తేల్చి చెబుతున్నారు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి