iDreamPost

గ్రేటర్ విశాఖ ఫలితాలపై స్టీల్ ప్లాంట్ ఎఫెక్ట్

గ్రేటర్ విశాఖ ఫలితాలపై స్టీల్ ప్లాంట్ ఎఫెక్ట్

గ్రేటర్ విశాక పట్టణ ఫలితం ఏంటి అన్నది ఇప్పుడు ఆసక్తి పెంచుతోంది. ప్రాధాన పార్టీలు మాత్రం ఎవరికి వారు గెలుపై బయటకి ధీమాగా కనిపిస్తున్నా.. లోలోపల టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. భారీ ఓటింగ్ ఎవరికి అనుకూలంగా ఉంటుందనే భయం నెలకొంది. అయితే చాలా మున్సిపాలిటీలో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉండడంతో విశాఖ, విజయవాడ, గుంటూరు మున్సిపాలీటీల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ గెలుపు ఎవరిది అన్నది తీవ్ర ఉత్కంఠ పెంచుతోంది.

స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో భద్రంగా ఉన్న బ్యాలెట్‌ బాక్స్‌ల్లో ఓటర్ల తీర్పు ఏంటో తెలియక ఆందోళన చెందుతున్నారు నేతలు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం అవుతుంది. 70 మున్సిపాల్టీల్లో, 11 కార్పొరేషన్లకు కౌంటింగ్‌ జరగనుంది. చిలకలూరిపేట మున్సిపాల్టీ, ఏలూరు కార్పొరేషన్‌లో కౌంటింగ్‌ను హైకోర్టు ఆదేశాలను బట్టి తర్వాత చేపడతారు. మొత్తం 75 మున్సిపాల్టీల్లో 4 మున్సిపాల్టీలు ఏకగ్రీవమయ్యాయి. కార్పొరేషన్లలో కన్నా మున్సిపాల్టీల్లోనే ఎక్కువగా పోలింగ్‌ నమోదైంది. 12 కార్పొరేషన్లలో 57.14 శాతం ఓట్లు పోలైతే.. కార్పొరేషన్లలో 62.28 శాతం పోలింగ్‌ జరిగింది. మరి ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి..

ముఖ్యంగా రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, గుంటూరుల్లో గెలుపు ఎవరిదనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా స్టీల్‌ సిటీలో ఉక్కు ఉద్యమం దెబ్బ ఎవరికి పడుతుందో ఆదివారం తేలుతుంది. బీజేపీ, జనసేనకు ఎఫెక్ట్‌ తప్పదనే అంచనా ఉంది. వైసీపీ ఎంపీలు, మంత్రులు స్టీల్ ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. దానికి మాజీమంత్రి టీడీపీ రాష్ట్ర నేత గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాధ్ వేలాదిమంది తన అనుచరులతో ఇటీవలే వైసీపీలో చేరారు. ఈ పరిణామం టిడిపికి పెద్ద ఎదురుదెబ్బ గా చెప్పవచ్చు. దీంతో ఈ ఎన్నికల ఫలితాలపై ఇబ్బందులు తప్పవా…అనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

Also Read : హిందూపురంలో బాలయ్యకు ఝలక్ తగలబోతోందా..?

అధికార వైసీపీకి గ్రేటర్ విశాఖ విజయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే అక్కడ నుంచి పాలించేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో స్థానికంగా వేరే పార్టీ అధికారంలో ఉంటే ఇబ్బందులు తప్పవు. దానికి తోడు విశాఖను రాజధానిగా చేయడం స్థానికులు ఇష్టం లేదనే ప్రచారం మొదలవుంది. అందుకే ఎలాగైనా విశాఖ నెగ్గాలని వైసీపీ భావిస్తోంది. విశాఖ బాధ్యతలన్నీ ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గరుండి చూశారు. గెలుపుకోసం ఆయన చాలా వ్యూహాలు రచించారు. విరామం లేకుండా ఇంటింటికీ తిరిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ బలంగా ఉండడంతో.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయసాయిరెడ్డి పాదయాత్ర కూడా చేశారు.

విశాఖ జీవీఎంసీలో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో విశాఖ జీవీఎంసీని ఈసారి ఎవరు కైవసం చేసుకుంటారన్నది అందరిలో ఉత్కంఠ పెంచుతోంది. విశాఖ జిల్లాలో రెండు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. యలమంచిలి మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంటుందని భావిస్తున్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో టీడీపీ గట్టి పోటీనిచ్చింది. దీంతో ఇక్కడ గెలుపు ఎవరిది అనేదానిపై ఉత్కంఠగా ఉంది. గ్రేటర్ విశాఖ పీఠం మాత్రం ప్రధాన పార్టీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

ఇక విజయనగరం జిల్లాలో.. 3 మున్సిపాలిటీలను, నగర పంచాయతీని.. వైసీపీయే దక్కించుకుంటుందని అంచనా వేస్తున్నారు. విజయనగరం కార్పొరేషన్ పీఠం కూడా వైసీపీకే దక్కే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 3 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. పలాస మున్సిపాలిటీలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరి నడిచింది. మిగిలిన రెండు మున్సిపాలిటీల్లోనూ.. వైసీపీ గట్టి పోటీ కనబర్చింది. మరిఫలితాలు అనుకూలంగా ఉంటయో.. ప్రభుత్వం వ్యతిరేకతకు అద్దం పడతాయో చూడాలి.

Also Read : అందరి దృష్టి ఆ రెండు నగరాలపైనే, చివరకు ఏం జరుగుతుంది?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి