iDreamPost

నిమ్మగడ్డ రమేష్ ప్రభుత్వానికి దొరికిపోయారా?

నిమ్మగడ్డ రమేష్ ప్రభుత్వానికి దొరికిపోయారా?

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను అర్ధాంతరంగా నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ విషయంలో, సంక్షేమ పధకాల అమలు విషయంలో అడ్డగోలు నిబందనలు పెట్టిన నిమ్మగడ్డ రమేష్ పై సుప్రీం కోర్టు తలుపు తట్టడంతో ప్రభుత్వ అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు కీలక వాఖ్యలు చేసింది. తిరిగి స్థానిక ఎన్నికల తేది నిర్ణయించాకే తిరిగి కోడ్ ప్రకటించాలని , అప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాలకు అంతరాయం కలిగించవద్దు అని సూచిస్తు , ఎన్నికల రద్దు నిర్ణయం తీస్కునే ముందు రాష్ట్ర ప్రభుత్వంతో ఎందుకు సంప్రదించలేదని ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ ని తీవ్రంగా మందలించింది. ఇలా కోర్టు తీర్పు వచ్చీ రాగానే నిమ్మగడ్డ రమేష్ ప్రభుత్వం పై అధికారులపై ముఖ్యమంత్రి పై తీవ్ర పరుష పదజాలంతో కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర బలగాలు పంపి తనకు ప్రభుత్వం నుండి రక్షణ కలిపించాలని కోరి ప్రభుత్వాన్ని పలచన చేసే విధంగా వ్యవహరించారు.

నిమ్మగడ్డ రమేష్ లేఖ వ్యవహారం వెనక తెలుగుదేశం ప్రోద్భలం కుట్ర ఉన్నాయని మొదటి నుండి ప్రభుత్వం అనుమానం వ్యక్తపరుస్తు వచ్చింది. ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలనే దురుద్దేశంతో నిమ్మగడ్డ రమేష్ ని అడ్డు పెట్టుకొని లేఖ డ్రామాలు ఆడుతున్నారు అని ఆరోపించింది. ఆ లేఖ నిజంగా నిమ్మగడ్డ రమేషే రాసి ఉంటే ఆ విషయాన్ని దైర్యంగా ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రశ్నించింది . యెల్లో మీడియాకి మాత్రమే లేఖ అందడం వెనక తెలుగుదేశం హస్తం లేదు అంటే ఎలా నమ్మాలని సూటిగా ప్రశ్నించింది . అయితే ఆ లేఖ వెనక ఉన్న కుట్ర వ్యవహారాన్ని తేల్చాలని నిశ్చయించుకున్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు దీనిపై క్షుణ్నంగా విచారించాలని కోరుతూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. లేఖపై ఎస్‌ఈసీ స్పష్టత ఇవ్వకున్నా ఎల్లో మీడియా కథనాలు వండి వార్చడం అనుమానాలకు తావిస్తోందన్నారు.

రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మాట్లాడుతు లేఖలో నిగ్గు తేలాల్సిన అంశాలు మూడు ఉన్నాయని తెలిపారు. నిమ్మగడ్డ పేరుతో ఆ లేఖపై సంతకం చేసింది ఎవరు? లేఖను ఏ ఐపీ అడ్రస్ ద్వారా హోం శాఖ అధికారికి మెయిల్ చేశారు? ఆ లేఖను ఎక్కడ, ఎవరు డ్రాఫ్ట్ చేశారు? అనే వాస్తవాలు పోలీసులు దర్యాప్తు చేసి తేల్చాలి అని చెప్పిన మరుక్షణం సుమారు గత నెల నుండి లేఖ విషయంలో మౌనం ప్రదర్శించిన నిమ్మగడ్డ రమేష్ ఒక్కసారిగా ఆ లేఖ ఎవరి ప్రమేయం లేకుండా తానే రాసినట్టు చెప్పుకొచ్చారు. నిమ్మగడ్డ ప్రవర్తనపై పూర్తి అనుమానం వచ్చిన వై.యస్ .ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పొలీసులను దర్యాప్తు వేగంగా చేసి నిజాలు నిగ్గు తేల్చాలని కోరారు.

వై.సి.పి సభ్యుల ఫిర్యాదు ఆదారంగా రంగంలోకి దిగిన సి.ఐ.డి అధికారులు తమ దర్యాప్తులో సంచలన విషయాలు బయట పెట్టారు. మొదటి నుండి వైసిపి సభ్యులు ఆరోపణలు చేస్తునట్టు ఈ లేఖ వ్యవహారంలో అనేక కుట్రకోణాలు దాగున్నాయి అని తమ ప్రాధమిక దర్యాప్తులో తేలినట్టు తెలిపారు . తాము నిమ్మగడ్డ రమేష్ అడిషనల్ పీఎస్‌ సాంబ మూర్తిని దర్యాప్తులో బాగంగా ప్రశ్నించగా అనేక విషయాలు బయటకు వచ్చినట్టు వివరించారు . సాంబ మూర్తి ల్యాప్ టాప్‌లో ఆ లేఖ తయారు చేసి పెన్ డ్రైవ్‌ ద్వారా లేఖను డెస్క్ టాప్‌లో వేసి ఆ లేఖను తర్వాత వాట్సాప్ వెబ్ ద్వారా రమేష్ కుమార్‌కు పంపినట్టు ఆ తరువాత ఆ లేఖను మొబైల్ నుండి రమేష్ కుమార్ కేంద్రానికి పంపినట్టు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ల్యాప్ టాప్‌లో ఫైల్స్ డిలీట్ చేయడంతో పాటు, పెన్ డ్రైవ్ ధ్వంసం చేసినట్టు ఆ తరువాత డెస్క్ టాప్ కూడా ఫార్మాట్ చేసినట్టు దర్యాప్తులో సాంబ మూర్తి వెల్లండించినట్టు చెప్పుకొచ్చారు.

అయితే ఆ ఆదారలను ద్వంసం చేయడం , నిమ్మగడ్డ రాసిన లేఖ సంఖ్య 221తోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు రాసిన రెఫ్రెన్స్ లెటర్‌ కూడా ఉండడం తో అనేక అనుమానాలు వస్తునట్టు. దీనిపై మరింత లోతుగా దర్యప్తు చెయవలసిన అవసరం ఉందని ఆధారాలు ట్యాంపర్‌ చేసిన అంశంపై కూడా కేసు నమోదు చేసినట్టు సీఐడీ డీజీ సునీల్‌ కుమార్‌ తెలిపారు.. ప్రాధమికంగా జరిగిన దర్యప్తులో ఇన్ని కుట్ర కోణాలు బయటప్డటంతో ఇక పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగితే నిమ్మగడ్డ రమేష్ పూర్తిగా ప్రభుత్వానికి దొరికిపొయే అవకాశాలే ఎక్కువ ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి