iDreamPost

cotton candy: పీచు మిఠాయిలో అంత డేంజర్ ఏముంది? బ్యాన్ ఎందుకు చేస్తున్నారు?

  • Published Feb 24, 2024 | 5:50 PMUpdated Feb 24, 2024 | 7:47 PM

మారుతున్న కాలంలో వాతావరణంతో పాటు.. ఆహారంలోను కల్తీ మొదలైన సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, ఈ మధ్య కాలంలో నిషేధించబడిన ఆహారంగా.. పరిగణలో ఉన్న ఆహార పదార్ధం పీచు మిఠాయి.

మారుతున్న కాలంలో వాతావరణంతో పాటు.. ఆహారంలోను కల్తీ మొదలైన సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, ఈ మధ్య కాలంలో నిషేధించబడిన ఆహారంగా.. పరిగణలో ఉన్న ఆహార పదార్ధం పీచు మిఠాయి.

  • Published Feb 24, 2024 | 5:50 PMUpdated Feb 24, 2024 | 7:47 PM
cotton candy: పీచు మిఠాయిలో అంత డేంజర్ ఏముంది? బ్యాన్ ఎందుకు చేస్తున్నారు?

ఇప్పుడు అందరూ జంక్ ఫుడ్ కు బాగా అలవాటు పడిపోయారు. అన్ని తెలిసిన పెద్దవాళ్ళే రుచుల కోసం బయట ఫుడ్ తింటున్నారు. ఇక చిన్న పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, చిన్న పిల్లలు ఎక్కువగా బిస్కెట్స్ , చాక్లెట్స్ , ఐస్ క్రీమ్స్ , పీచు మిఠాయిలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. తల్లిదండ్రులు ఎంత కంట్రోల్ చేయాలని చూసినా కూడా.. వారు జంక్ ఫుడ్ కోసం మారం చేస్తూనే ఉంటారు. ఇక తల్లిదండ్రులు కూడా ఎపుడైనా ఓసారి పర్లేదులే అనుకుని పిల్లలు అడిగిన దానికి సరే అంటారు. అయితే, వీటన్నిటిలో ఇప్పుడు ఎవరైనా పీచు మిఠాయిని తినాలని అనుకుంటే మాత్రం. వారికి ప్రాణహాని తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పీచు మిఠాయి వలన అనేక నష్టాలు కలుగుతున్నాయంటూ.. కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి పీచు మిఠాయి తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా! నిజంగానే ఇది తినడం వలన ప్రాణ హాని జరుగుతుందా ! దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు పీచు మిఠాయిని బ్యాన్ చేశాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఈ పీచు మిఠాయి శాంపిల్స్ ను టెస్టింగ్ కు పంపించాయి. తమిళనాడులో చేసిన టెస్టింగ్ లో ఈ పీచు మిఠాయిలో క్యాన్సర్ ను ప్రేరేపించే రసాయనాలు ఉన్నాయని తేలింది. దీంతో వీటి అమ్మకాలను తమిళనాడు నిషేధించింది. అయితే , పీచు మిఠాయిలో రంగు రావడానికి “రోడమైన్ బి” అనే రసాయనాన్ని ఉపయోగిస్తారట. దీని వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని నిపుణులు తేల్చి చెప్పారు. కాబట్టి వీటిని ఆయా ప్రాంతాల్లో నిషేదించారు. ఇక ఇప్పుడు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకునే ఆలోచనలో ఉన్నాయా ! అసలు రోడమైన్ బి అంటే ఏమిటి ! దానిని ఇంకా ఏ ఏ ఆహార పదార్దాలలో ఉపయోగిస్తారు. అనే విషయాలను తెలుసుకుందాం.

రోడమైన్ బి అనేది ఒక సింథటిక్ కలర్ దీన్ని ఉపయోగించడం వలన రెడ్, రోజ్ కలర్స్ బాగా మెరుస్తూ కనిపిస్తూ ఉంటాయి. నిజానికి వీటిని బట్టలు తయారీ, రంగు రంగుల పేపర్స్ ను తయారు చేయడం కోసం ఉపయోగిస్తారు. అయితే, దీన్ని ఆహారంగా తీసుకుంటే మాత్రం తిప్పలు తిప్పవు. రోడమైన్ బి లో క్యాన్సర్ కు సంబంధించి రసాయనాలు ఉన్నాయని.. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ప్రకటించింది. వస్త్రాలను తయారు చేయడానికి మాత్రమే ఈ రసాయనాన్ని వాడడానికి అనుమతి ఉంది. అయితే, ఒక్క పీచుమిఠాయి మాత్రమే కాకుండా .. రోజ్ మిల్క్, జెల్లీలు, క్యాండీలు చివరికి కారం పొడి, చెరుకు రసం, సాస్ లు ఇలా ఎరుపు రంగు ఉన్న ప్రతిదానిలోనూ చట్ట విరుద్ధంగా రోడమైన్ బి ని ఉపయోగిస్తున్నారు. 

అయితే, ఈ రసాయనం కలిపి ఉన్న ఆహార పదార్థాలు తినడం వలన లివర్ సమస్యలు, క్యాన్సర్ సమస్యలు లాంటివి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆహార ఉత్పత్తుల్లో రోడమైన్ బి ఉందొ లేదో అనే విషయాన్ని ల్యాబ్ లో టెస్ట్ చేయడం ద్వారా మాత్రమే తెలుసుకోగలం. కానీ, సహజంగా అందరూ దాన్ని తెలుసుకోవాలంటే మాత్రం ఒకటే మార్గం. ఆహార పదార్థాలు రంగు రంగులతో మెరుస్తూ కనిపిస్తే కనుక వాటిలో రోడమైన్ బి ఉన్నట్లు గ్రహించాలి. ఈ రసాయనం ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ ఎఫెక్ట్ వెంటనే చూపించకపోయినా కూడా.. వారి ఎదుగుదలపై ఇది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.

కాబట్టి పీచు మిఠాయి తింటే ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఈ పీచు మిఠాయిని నిషేధించారు. ఇక పూర్తి ల్యాబ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీన్ని  కంప్లీట్ గా బ్యాన్ చేయాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకోనున్నారట. మరి, మీరు పీచు మిఠాయి తింటున్నారా? మీరు తినడమే కాక మీ పిల్లలకు కూడా తినిపిస్తున్నారా? అయితే జాగ్రత్త. ఈ విషయాన్ని మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి వారి ఆరోగ్యాన్ని కాపాడండి. అలానే డబ్బు కోసం వస్త్రాల తయారీకి వాడే రంగులను ఆహార పదార్థాల్లో వాడుతుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి