iDreamPost

ఆలీకి కరోనా.. వైద్యుల తికమక

ఆలీకి కరోనా.. వైద్యుల తికమక

కరోనా వైరస్ భాదితులకు చికిత్స లో వైద్యుల అప్రమత్తత లేమి తెలంగాణ సర్కార్ ను టెన్షన్ పెట్టింది. ఆస్పత్రిలో ఇద్దరి పేర్లు ఒకేలా ఉండటం తో పాజిటివ్ ఉన్న వ్యక్తిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ లోని చెస్ట్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. అసలు విషయం తెలుసుకున్న వైద్యులు జరిగిన పొరపాటును 24 గంటల తర్వాత గుర్తించారు. కరోనా పాజిటివ్ వ్యక్తి 24 గంటలు బయట ఉండడంతో అటు వైద్యులు ఇటు ప్రభుత్వ అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

కొత్తగూడెం జిల్లాకు చెందిన డీఎస్సీ ఆలీకి కరోనా వైరస్ సోకింది. ఢిల్లీ సదస్సుకు వెళ్లి వచ్చిన అలీకి వైరస్ సోకడంతో హైదరాబాద్ లోని చెస్ట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్ ఎం ఆలీ అనే మరో వ్యక్తి కరణ లక్షణాలతో బాధపడుతుండడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎస్ ఎం అలికి పలుమార్లు కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎస్.ఎమ్ ఆలీని నిన్న గురువారం వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అయితే ఎస్ ఎమ్ ఆలీ కి బదులు వైద్యులు.. డీఎస్సీ అలీని ఇంటికి పంపారు. ఆయన కొత్తగూడెంలోని తన స్వగృహానికి వెళ్లిపోయారు. ఈరోజు శుక్రవారం సాయంత్రం జరిగిన విషయాన్ని గుర్తించిన వైద్యులు హుటాహుటిన కొత్తగూడెం పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్సీ ఆలీని వెంటనే హైదరాబాద్ లోని చెస్ట్ ఆస్పత్రికి తీసుకురావాలని కోరారు.

గడచిన 24 గంటల్లో డీఎస్సీ ఆలీ ఎవరెవరిని కలిశారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఎవరైనా కలిసి ఉంటే వారికి కూడా వైరస్ సోకే ప్రమాదం ఉండడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. బంధువులు చుట్టుపక్కలవారు పరామర్శకు ఆలీ వద్దకు వచ్చే అవకాశం ఉండడంతో వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. వైద్యుల నిర్లక్ష్యం అధికారులకు కొత్త కష్టాలను తెచ్చి పెట్టినట్లైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి