iDreamPost

అందం, నటన అన్నీ ఉన్నా.. అవకాశాలు మాత్రం నిల్! ఎవరా హీరోయిన్?

  • Published Apr 18, 2024 | 4:35 PMUpdated Apr 18, 2024 | 4:35 PM

సిని పరిశ్రమలో వరుస స్టార్ హీరోలతో మంచి హిట్ సినిమాల్లో నటించిన ఓ హీరోయిన్ గత కొంతకాలంగా కెరీర్ పరంగా కాస్త డల్ అయ్యింది. అయితే ఆకర్షించే అందం, అద్భుతమైన నటన అన్నీ ఉన్నప్పటికి అవకాశాలు మాత్రం ఈ బ్యూటీకి కనుమరుగయ్యాయి. ఇంతకి ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?

సిని పరిశ్రమలో వరుస స్టార్ హీరోలతో మంచి హిట్ సినిమాల్లో నటించిన ఓ హీరోయిన్ గత కొంతకాలంగా కెరీర్ పరంగా కాస్త డల్ అయ్యింది. అయితే ఆకర్షించే అందం, అద్భుతమైన నటన అన్నీ ఉన్నప్పటికి అవకాశాలు మాత్రం ఈ బ్యూటీకి కనుమరుగయ్యాయి. ఇంతకి ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?

  • Published Apr 18, 2024 | 4:35 PMUpdated Apr 18, 2024 | 4:35 PM
అందం, నటన అన్నీ ఉన్నా.. అవకాశాలు మాత్రం నిల్! ఎవరా హీరోయిన్?

చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు కొదవ ఉండదు కానీ, అవకాశాలకు మాత్రం కొరత ఉంటుంది. ఎందుకంటే.. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సక్సెస్ అవ్వలంటే.. అందం, అభినయంతో పాటు అవకాశాలు కూడా జోరుగా ఉండాలి. ఇక ఈ రెండు కలగలిగిన ఆఫర్లను సొంతం చేసుకునే విషయంలో మాత్రం కొందరు తారలు ఫెయిలవుతున్నారు. ముఖ్యంగా..ఈ పరిశ్రమలో ఆకాశమంత అందం ఉన్నా.. ఆవ గింజ అంత అదృష్టం కూడా తోడై ఉండాలి. అది లేనిదే ఎంత అందం ఉన్న ఇండస్ట్రీలో కనుమరుగవుతారు. అయితే కొంతమంది మాత్రం ఏకంగా స్టార్ హీరోల సరసన బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసినప్పటికీ.. అవి బాక్సాఫీస్ దగ్గర బోల్లా కొట్టాడమో లేక ఆ సినిమా హిట్ అయిన అవకాశాలు వీరికి ఉన్నా క్రేజ్ అనేది పూర్తిగా డౌన్ అవుతుంది. మరి, అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకొనే హీరోయిన్ కూడా అదే కొవకు చెందినది. అయితే ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఈమె అమ్మాడు కూడా ఒకరు. అంతేకాకుండా.. అందం, అద్భుతమైన నటన అన్నీ కలిగివున్న సరైన అవకాశాలను మాత్రం ఈ బ్యూటీ అందుకోలేక పోతుంది. ఇంతకి ఈ హీరోయిన్ ఎవరంటే..?

టాలీవుడ్ లో ఒకప్పుడు బిజీగా ఉన్న హీరోయిన్లలో రాశి ఖన్నా కూడా ఒకరు. ఈమె ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. కాగా, ఆ సినిమాలో రాశి క్యూట్ లుక్స్, అద్భుతమైన నటనతో అందర్నీ అకట్టుకున్నవిషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ఈ అమ్మాడుకి వరుస అవకాశాలనేవి క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే.. బెంగాల్ టైగార్, తొలి ప్రేమ, ప్రతిరోజు పండగే వంటి సినిమాలతో ఇండస్ట్రీలో ఓ ఊపు మీద కనిపించింది. అయితే అలా దక్షిణాది చిత్రాలతో పాటు హిందీలోనూ వరుసగా సినిమాలో మంచి ఊపులో ఉన్న ఈ బ్యూటీ.. గత కొన్ని రోజులుగా కెరీర్ పరంగా కాస్త డల్ అయింది. తొలిప్రేమ సినిమాతో ప్రేక్షకులను అలరించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హీరోయిన్ కు ఆ తర్వాత అవకాశాలు అనేవి పూర్తిగా కనుమరుగయ్యాయి. అందుకు కారణం.. వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థ్యాంక్యూ వంటి సినిమాలు వరుసగా డిజాస్టర్లుగా నిలవడమే రాశి కెరీర్ గాడి తప్పిందని చెప్పవచ్చు.

ఇక తెలుగులో థ్యాంక్యూ సినిమా తర్వాత రాశి మరి ఏ సినిమాల్లో కూడా కనిపించలేదు. ఆ తర్వాత బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ అమ్మాడు దృష్టి పెట్టడంతో.. ఇక తెలుగులో రాశి కెరీర్ ముగిసినట్లే అనుకున్నారంతా. అలాగే మంచి అందం, అభినయం, టాలెంట్ కలగలిగిన రాశి ఖన్నాకు తెలుగులో ఛాన్స్ లు లేకపోవడం.. ఏ సినిమాల్లో కనిపించకపోవడంతో ఆమె ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. ఎందుకంటే.. ఇప్పటి వరకు రాశి నటించిన ఏ సినిమాల్లో అయిన రాశి స్క్రీన్ ప్రెజెంటెన్షన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు స్టార్ హీరోల అందరి సరసన నటించి.. స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలగాలసిన రాశిని ఎవరూ ఎందుకు పట్టించుకోవడం లేదని ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలోనే కొంచెం గ్యాప్ తర్వాత రాశి మళ్లీ తెలుగులో సినిమాల్లో బిజీ అవుతోందని సమాచారం వినిపిస్తోంది.

తాజాగా నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం `రాబిన్‌వుడ్‌`. అయితే  ఇందులో హీరోయిన్ గా  ముందు ర‌ష్మిక‌ను అనుకొన్నారు.  కానీ ఆ తర్వాత..  ఆ స్థానంలో శ్రీ‌లీల‌ని  తీసుకున్నట్లు టాక్ వినిపించింది. అయితే మళ్లీ ఏమైందో తెలియదు కానీ, ఇప్పుడు శ్రీలీలా ప్లేస్ లో రాశీ ఖన్నాను ఎంచుకొన్నారనే టాక్ జోరుగా వినిపిస్తోంది. కాగా, దీనిపై చిత్రబృందం ఎలాంటి అధికారక ప్రకటన చేయలేదు. ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 20న విడుదల చేస్తామని మేకర్స్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.  కాగా, ఈ సినిమాలో రాశీ నటిస్తుందనే వార్త ఎంత వరకు నిజమే తెలియదు కానీ, ఈ సినిమా అయిన సక్సెస్ గా నిలిచి రాశి కెరీర్ మళ్లీ ఊపందుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. మరి, నితిన్ సినిమాలో రాశి ఖన్నా నటిస్తుందనే టాక్ పై మీ అభిప్రాాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి