iDreamPost

విరాట్‌ కోహ్లీ ఏ బాల్‌ ఆడేందుకు భయపడతాడో తెలుసా?

బరిలోకి దిగితే పరుగుల వరద పారించే సత్తా ఉన్న కింగ్ కోహ్లీ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. తాను బ్యాటింగ్ చేసేటప్పుడు ఆ బాల్ ఆడడానికి ఇబ్బంది పడతాను అని వెల్లడించారు. అనుష్క శర్మతో జరిగిన చిట్ చాట్ లో ఈ విషయాన్ని తెలిపారు.

బరిలోకి దిగితే పరుగుల వరద పారించే సత్తా ఉన్న కింగ్ కోహ్లీ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. తాను బ్యాటింగ్ చేసేటప్పుడు ఆ బాల్ ఆడడానికి ఇబ్బంది పడతాను అని వెల్లడించారు. అనుష్క శర్మతో జరిగిన చిట్ చాట్ లో ఈ విషయాన్ని తెలిపారు.

విరాట్‌ కోహ్లీ ఏ బాల్‌ ఆడేందుకు భయపడతాడో తెలుసా?

విరాట్ కోహ్లీ టీమిండియా క్రికెట్ లో ఓ మేలిమి వజ్రం. అతడి ఆటకు ప్రపంచమే ఫిదా అయిపోతది. మంచినీళ్లు తాగినంత సులభంగా సెంచరీలు బాదేస్తూ, వేల పరుగులు చేస్తూ తనకు తానే సాటిగా నిలిచాడు కింగ్ కోహ్లీ. ఛేజ్ మాస్టర్ బరిలోకి దిగాడంటే లక్ష్యం ఎంతున్న విజయం పక్కా అనేంతగా తనదైన ముద్ర వేశారు ఈ పరుగుల మిషన్. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో అసాధారణ ఆటతీరుతో 121 బంతుల్లో సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచారు. ఈ సెంచరీతో వన్డేల్లో క్రికెట్ గాడ్ సచిన్ పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డును సమం చేశాడు. అయితే ఇంతటి రికార్డుల రారాజైన కోహ్లీకి ఆ బాల్ అంటే భయమట. ఈ విషయాన్ని ఓ చిట్ చాట్ లో పాల్గొన్ సందర్భంగా వెల్లడించాడు.

మైదానంలో చిరుత పులిలా ఉంటూ అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేస్తూ అసలు సిసలైన క్రికెటర్ గా పేరుగాంచాడు విరాట్ కోహ్లీ. క్రికెట్ హిస్ట్రీలో ఎన్నో రికార్డులు ఆయన పేరుమీద లిఖించబడ్డాయి. వన్డే కెరీర్ లో 49వ సెంచరీ నమోదు చేసిన కింగ్ కోహ్లీ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టేందుకు మరో అడుగు దూరంలో ఉన్నారు. కాగా కింగ్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో జరిగిన చిట్ చాట్ లో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కోహ్లీ బ్యాటింగ్ చేసేటపుడు ఎదుర్కొన్న బంతుల గురించి అనుష్క శర్మ అడిగారు.

క్రీజులో ఉన్నప్పుడు యార్కర్ అంటే భయమా? 150 స్పీడ్ లో ఉన్న బౌన్సర్ అంటే భయమా? అని అనుష్క ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన విరాట్ యార్కర్ అయితే డిఫెన్స్ ఆడొచ్చని తెలిపారు. కానీ బౌన్సర్ అంటే భయమని ఛేజ్ మాస్టర్ చెప్పారు. బౌన్సర్ బాల్ ను ఎదుర్కొవాలంటే కాస్త ఇబ్బంది ఉంటుందని కోహ్లీ వెల్లడించారు. కాగా ప్రపంచకప్ లో సెమీస్ కు చేరిన టీమిండియా చివరి లీగ్ మ్యాచ్ నవంబర్ 12న నెథర్లాండ్స్ తో ఆడనున్నది. మరి కోహ్లీ బౌన్సర్ బాల్ ఎదుర్కోవడం భయమన్నా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

నేను జట్టు కోసం ఏం చేస్తున్నానో చాలా మందికి తెలియదు: కోహ్లీ

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి