iDreamPost

క్రేజీ కాంబో.. VI ఆనంద్ తో బన్నీ మూవీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

VI Anand-Allu Arjun: టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ తెలుగులో కొత్త తరహా కథలతో ప్రయోగాలు చేయడంలో ముందుంటాడు. ఇక ఆయన దర్శకత్వంలో బన్నీ నటించబోతున్నాడన్న వార్తలపై స్వయంగా క్లారిటీ ఇచ్చాడు.

VI Anand-Allu Arjun: టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ తెలుగులో కొత్త తరహా కథలతో ప్రయోగాలు చేయడంలో ముందుంటాడు. ఇక ఆయన దర్శకత్వంలో బన్నీ నటించబోతున్నాడన్న వార్తలపై స్వయంగా క్లారిటీ ఇచ్చాడు.

క్రేజీ కాంబో.. VI ఆనంద్ తో బన్నీ మూవీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

ఇండస్ట్రీలో కాంబినేషన్ కు ఉండే క్రేజే వేరు. పలానా డైరెక్టర్ తో పలానా హీరో సినిమా పడితే ఉంటదిరా.. అంటూ అభిమానులకు కొన్ని ఆశలు ఉంటాయి. అయితే అలాంటి రేర్ కాంబోలు సెట్ అవ్వడానికి కొంత టైమ్ పడుతుంది. ప్రస్తుతం ఓ క్రేజీ కాంబినేషన్ గురించి వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? టాలీవుడ్ లో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే చాలా మంది డైరెక్టర్ల పేర్లు లిస్ట్ లోకి వస్తాయి. కానీ అందులో ముందువరుసలో ఉంటాడు టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్. తెలుగులో కొత్త తరహా కథలతో ప్రయోగాలు చేయడంలో ముందుంటాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా ‘ఊరిపేరు భైరవకోన’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

VI ఆనంద్.. టాలీవుడ్ లో కొత్త తరహా కథలతో ప్రయోగాలు చేయడానికి ముందుంటాడు. సందీప్ కిషన్ తో టైగర్, నిఖిల్ తో ఎక్కడికి పోతావు చిన్నవాడ, మాస్ మహారాజా రవితేజతో డిస్కోరాజా లాంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సందీప్ కిషన్-వర్ష బొల్లమ్మ జంటగా ‘ఊరుపేరు భైరవకోన’ అనే చిత్రంతో ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ కు విశేషస్పందన లభించింది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మూవీ యూనిట్ సైతం ప్రమోషన్స్ లో దూకుడుచూపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ వీఐ ఆనంద్ మీడియాతో ముచ్చటించారు. అయితే గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-వీఐ ఆనంద్ కాంబోలో ఓ మూవీ ఉంటుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఇదే ప్రశ్న ఆయనకు ఎదురైంది. దానికి వీఐ ఆనంద్ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు.

“బన్నీతో నేను ఓ సినిమా చేయాల్సి ఉంది. గతంలో కొన్ని కథలను ఆయనకు వినిపించాను. ఒక సైఫై స్టోరీని కూడా నెరేట్ చేశాను. అయితే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా, పెద్దగా ఓ కథను రెడీ చేయమన్నారు. అయితే అప్పుడు నేను అలాంటి స్టోరీని రాయలేదు. కానీ త్వరలోనే బన్నీని కలుస్తాను. ఫ్యూచర్ లో మా కాంబినేషన్ తప్పకుండా ఉంటుంది. ఇక నా నెక్ట్స్ సినిమా గీతా ఆర్ట్స్ లో నిఖిల్ హీరోగా చేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ వీఐ ఆనంద్. దీంతో బన్నీ ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు. ఎందుకంటే? వీఐ ఆనంద్ సినిమా అంటే కొత్త తరహా కథలే.. దాంతో ఈ క్రేజీ కాంబో రెడీ అయితే కచ్చితంగా మ్యాజిక్ జరుగుతుందని సోషల్ మీడియా వేదికగా వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ క్రేజీ కాంబో సెట్ అయితే ఎలా ఉంటుందో? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: హనుమాన్ vs శ్రీఆంజనేయం! పాపం తప్పు అంతా ఛార్మిపై నెట్టేశారు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి