iDreamPost

“ధర్మం కోసం నిలబడేవాడు ఎప్పటికీ గెలుస్తాడు”.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

హనుమాన్ విడుదలై నాలుగు రోజులు కావొస్తున్నా అదే జోరు కొనసాగుతోంది. పాజిటీవ్ టాక్ సొంతం చేసుకున్న హనుమాన్ సాలిడ్ హిట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హనుమాన్ విడుదలై నాలుగు రోజులు కావొస్తున్నా అదే జోరు కొనసాగుతోంది. పాజిటీవ్ టాక్ సొంతం చేసుకున్న హనుమాన్ సాలిడ్ హిట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

“ధర్మం కోసం నిలబడేవాడు ఎప్పటికీ గెలుస్తాడు”.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం హీరో తేజ సజ్జ కాంబోలో వచ్చిన మూవీ హనుమాన్. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న థియేటర్లలో విడుదలైంది. హనుమాన్ మూవీకి ఫస్ట్ నుంచే ఆడియెన్స్ నుంచి అదిరిపోయే ఆదరణ లభించింది. థియేటర్లలో హనుమాన్ హవా కొనసాగుతోంది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా రూపొందించిన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. హనుమాన్ విడుదలై నాలుగు రోజులు కావొస్తున్నా అదే జోరు కొనసాగుతోంది. పాజిటీవ్ టాక్ సొంతం చేసుకున్న హనుమాన్ సాలిడ్ హిట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హార్ట్ బ్రేకింగ్ తో ఉన్న ఆ ట్వీట్ పై ఆయన స్పందించారు.

తక్కువ బడ్జెట్ లోనే అదిరిపోయే గ్రాఫిక్స్, వీఎఫ్ ఎక్స్ సీన్స్, విజువల్ వండర్ గా హనుమాన్ మూవీ నిలిచింది. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ తమ టీమ్ పై ఫేక్ ప్రచారం చేస్తూ ట్వీట్ చేసిన వారికి సోషల్ మీడియా వేదికగా చురకలంటించారు. ప్రశాంత్ వర్మ హార్ట్ బ్రేకింగ్ ట్వీట్ కు క్లారిటీ ఇస్తూ ‘కొందరు నకిలీ ప్రొఫైల్స్‌తో సోషల్ మీడియాలో మా టీంపై విపరీతంగా ప్రచారం చేశారు. కానీ ఇంకా కొందరు డిజిటల్ చెత్తను భోగి మంటల్లో వేయడం మరిచిపోయినట్లు ఉన్నారు.

ఏది ఏమైనప్పటికీ ‘ధర్మం కోసం నిలబడేవాడు ఎప్పటికీ గెలుస్తాడు’. తమ తిరుగులేని మద్దతును అందించిన సినీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తమపై వచ్చిన నెగెటివిటీని తొక్కేసి.. ఈ సంక్రాంతికి హనుమాన్ అనే గాలిపటం మరింత ఎత్తుకు ఎగరడానికి సిద్ధంగా ఉంది. ‘ అంటూ ప్రశాంత్ వర్మ వెల్లడించారు. కాగా ఈ చిత్రంలో అమృత అయ్యర్, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్,సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. మరి ఫేక్ అకౌంట్లతో హనుమాన్ టీం పై ట్రోల్స్ చేసిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి