iDreamPost

నాకు బురద తుడుచుకునే టైమ్ లేదు.. యాత్ర డైరెక్టర్ కామెంట్స్!

యాత్ర మూవీ సీక్వెల్ యాత్ర 2 ఫిబ్రవరి 8న రాబోతుంది.. ఇప్పటికే టీజర్, ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వచ్చంది. మూవీ ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.

యాత్ర మూవీ సీక్వెల్ యాత్ర 2 ఫిబ్రవరి 8న రాబోతుంది.. ఇప్పటికే టీజర్, ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వచ్చంది. మూవీ ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.

నాకు బురద తుడుచుకునే టైమ్ లేదు.. యాత్ర డైరెక్టర్ కామెంట్స్!

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో బయోపిక్ చిత్రాలు వచ్చాయి. సినీ, రాజకీయ, క్రీడా నేపథ్యంలో పలు బయోపిక్ లు వెండితెరపై సందడి చేయగా కొన్ని మాత్రమే సక్సెస్ సాధించాయి. అలాంటి చిత్రంలో మహానేత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ‘యాత్ర’ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీలో ఆయన పాదయాత్ర సందర్భంగా ఉన్న సన్నివేశాలు తెలుగు వారిని బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు యాత్ర 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ బిజీలో ఉన్నారు.  ఓ ప్రెస్ మీట్ లో మూవీ పై డైరెక్టర్ మహి వీ రాఘవ తనదైన స్టైల్లో స్పందించారు. వివరాల్లోకి వెళితే..

యాత్ర 2 మూవీ ఫిబ్రవరి 8 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ బిజీలో ఉన్నారు. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో యాత్ర 2 డైరెక్టర్ మహి వి రాఘవ్ సినిమా, నటీనటుల గురించి స్పందించారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూస్తే ప్రేక్షకులకు అర్థం అయ్యే ఉటుంది.. యాత్ర 2 లో కేవలంల వైఎస్ జగన్ చేసిన పాదయాత్రనే మెయిన్ థీమ్ గా ఉంటుంది. ఈ మూవీలో ఎక్కువ పాత్రలు లేవు, ఎవరినీ కించపరిచేలా ఇందులో ఏ పాత్ర డిజైన్ చేయలేదు అన్నారు. ఈ మూవీలో సూపర్ స్టార్ మమ్ముట్టి తన అద్భుతమైన నటన కనబరిచారు.. ఆయన లేకుండా ఈ చిత్రాన్ని ఊహించలేం. ఈ మూవీ కోసం జీవి వంద శాతం ఎఫర్ట్ పెట్టారు.. ఇతర భాషా నటులను ఎందుకు తీసుకున్నాం అన్నదానిపై కూడా క్లారిటీ ఇచ్చారు మహి వీ రాఘవ్.

యాత్ర, యాత్ర 2 రాజకీయ నేథ్యంతో తీస్తే.. రాళ్లు విసిరే వారు రాళ్లు విసురుతూ ఉంటారు.. బురుద జల్లే వారు జల్లుతూనే ఉంటారు. కానీ నాకు బురద తూడ్చుకొని, రాళ్లు ఏరుకునే ఓపిక అస్సులు లేదు, సినిమా అనేది ఆడియన్స్ చేతులో ఉంటుంది.. వారే ఫైనల్ గా నిర్ణయిస్తారు. ఈ మూవీలో సీన్లు అన్నీ కల్పితం అని చెప్పలేం.. అలాగని నిజం అని చెప్పలేం. ఎవరినీ కించపర్చకుండా అందరికీ నచ్చే విధంగా.. ఎమోషన్, సోల్ ను బేస్ చేసుకొని సన్నివేశాలు రాసుకున్ననా.. అది మీకు చూపించాను అని అన్నారు. ట్రైలర్ లో మొదట మూగమ్మాయితో ఉన్న సీన్, చివర్లో బ్లైండ్ వ్యక్తితో ఉన్న సన్నివేశాల గురించి చెబుతూ.. వైఎస్సార్ ఎన్నో అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.. ఎంతోమందికి ఉపాది కల్పించారు.. సహాయం చేశారు. అదే పాయింట్, ఎమోషన్ ఈ సీన్లు పెట్టాను అని చెప్పుకొచ్చారు. ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది అన్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి