iDreamPost

గరుడపురాణంలో మయామైపోయిన ఆ మూడు పేజీలలో ఏముంది?

Ooru Peru Bhairavakona Movie: గరుడపురాణం కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ఊరి పేరు భైరవ కోన. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలయ్యింది. ఆ వివరాలు..

Ooru Peru Bhairavakona Movie: గరుడపురాణం కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ఊరి పేరు భైరవ కోన. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలయ్యింది. ఆ వివరాలు..

గరుడపురాణంలో మయామైపోయిన ఆ మూడు పేజీలలో ఏముంది?

కొందరు ఏదో ఒక వింత, విచిత్రం లేకుండా సినిమాలు చేయలేరు. అందరికీ భిన్నంగా, విభిన్నమైన కథ, విలక్షణబమైన కథనం, పాత్రలు ఇవన్నీ సమకూరితేనే సినిమా మేకింగ్ లోకి అడుగు పెడతారు. అటువంటి దర్శకుడే విఐ ఆనంద్. గతంలో ఆనంద్ తీసిన డిస్కో రాజా, ఒక్క క్షణం, టైగర్, ఎక్కడికీ పోతావు చిన్నవాడా లాటి సినిమాలు గుర్తుంటే….గుర్తుంటే కాదు. మర్చిపోయే సినిమాలా అవి. ఆ టైంలో వచ్చిన సినిమాలలో ఆనంద్ చేసిన సినిమాలు కొత్త మార్క్ ని కొట్టేశాయి. ఆనంద్ అంటే ఆకర్షణ ఫీలయ్యేటట్టు చేశాయి.

ఆనంద్ ఊరికే కూర్చుని, ఊసుపోని కథలతో సెట్స్ కి రాడని మరోసారి మళ్ళీ ప్రూవ్‌ చేసిన సినిమా…వచ్చే నెల ఫిబ్రవరి 9న విడుదలకు సిద్ధమవుతున్న ఊరిపేరు భైరవకోన. ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. వచ్చేటట్టు ఆనంద్ కష్టపడతాడు. అదే ఆనంద్ ప్రత్యేకత. మంచి నిర్మాతలు దొరికితే ఏ దర్శకుడికైనా సినిమా మేకింగ్ కేక్ వాకే. అలాంటిది ఆనంద్ లాంటి క్రియేటివ్ జీనియస్ కైతే మరీ మరీ కేక్ వాక్. దండా రాజేష్ నిర్మాతగా రూపొందిన ఊరిపేరు భైరవకోన ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. దండా రాజేష్ కి మంచి అనుభవంతో పాటు తిరుగులేని టేస్ట్ ఉంది. ఒక్కసారి కథ విని, నమ్మితే మరి వెను తిరగి చూసే రకం కాదు. ఎంత బడ్జెట్ అయనా, ఎన్నాళ్లు పట్టినా కూడా దమ్ముగా నిలబడే నైజం దండా రాజేష్ క్వాలిటీ.

sandeep kishan new movie

ఇప్పుడు చూడండి….ఊరిపేరు బైరవకోన. ఎక్కడ నుంచి పట్టుకొచ్చాడో ఈ విఐ ఆనంద్. గరుడ పురాణం కాన్సెప్ట్. గతంలో అపరిచితుడు సినిమాలో కూడా గరుడపురాణం కాన్సెప్ట్ ఉందని అందరూ నమ్మారు. అది పెద్ద హిట్. అలాగే ఇప్పుడు ఊరిపేరు భైరవకోన. ఇందులో టెన్సన్ పాయంట్ ఏంటంటే…..గరుడ పురాణంలో మిస్ అయిన మూడే పేజీలే ఊరిపేరు భైరవకోన అనే కొత్త మెలిక పెట్టాడు విఐ ఆనంద్. గరుడ పురాణంలో తెల్సినవాళ్ళకి తెలుసు, తెలియనివాళ్ళకి తెలియదు. ఎన్ని రహస్యాలున్నాయో అందులో. ఎన్ని వింతలు, విచిత్రాలూ ఉన్నాయో…అదో పెద్ద హిందూ మహా సముద్రం. అందులోనుంచి మిస్సయిన మూడు పేజీలని ఆనంద్ చేసిన ట్రైలర్లో వస్తుంది. ఏంటా మూడు పేజీలన్నదే ఇప్పుడు ప్రజెంట్ సస్సెన్స్.

విధిరాత దేవుడి ఆధీనంలో కూడా ఉండదు అనే ఫిలాసఫీయే ఊరిపేరు భైరవకోనకి మెయిన్ ఎలిమెంట్ అనిపిస్తోంది. మరోవైపు….చేతికి అంటుకున్న రక్తం కడుక్కున్నంత సులభం కాదు, చేసిన పాపాన్ని కడుక్కోవడం అని మళ్లీ మరో పేచీ. అంటే యాక్షన్ పార్ట్ కూడా మెయిన్. ట్రైలర్ బిగినింగ్ లోనే లవ్ ఎపిసోడ్ గ్లింప్సెస్. అంటే ఇక్కడే మూడు షేడ్స్ కనిపిస్తున్నాయి. గరుడ పురాణం సస్పెన్స్ ఫిలాసఫీ, లవ్ డ్రామా, యాక్షన్…..అంటే ఫుల్ లెంత్ వెరైటీ ఎంటర్ టైన్మెంట్ అన్నది ఫుల్ క్లారిటీ.

ఇప్పుడసలు ఇటువంటి మాయలు, మంత్రాలు, తంత్రాలూ ఉన్న సినిమాలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మథ్యనే వచ్చి పెద్ద హిట్స్ అయిన పొలిమేర 2, విరూపాక్ష సినిమాలే ఇందుకు పవర్ ఫల్ ఎగ్జాంపుల్స్. ఎన్నాళ్ళగానో హిట్ కోసం ఎదురుచూపులు చూస్తున్న హీరో సందీప్ కిషన్ ఫిబ్రవరిలో విఐ ఆనంద్ పేరున ఓ హిట్ ని కొట్టబోతున్నాడని టీం యూనిట్ ఘంటా పథంగా చెబుతున్నారు. గుడ్ లక్ దండా రాజేష్, విఐ ఆనంద్ అండ్ సందీప్ కిషన్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి