iDreamPost

డెవిల్‌ Vs బబుల్‌ గమ్‌ ఏ సినిమా బెస్ట్‌ అంటే..

Devil Vs Bubble Gum: డెవిల్‌, బబుల్‌ గమ్‌ సినిమాలు ఓ రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. బబుల్‌ గమ్‌ డిసెంబర్‌ 28న రాగా.. డెవిల్‌ డిసెంబర్‌ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Devil Vs Bubble Gum: డెవిల్‌, బబుల్‌ గమ్‌ సినిమాలు ఓ రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. బబుల్‌ గమ్‌ డిసెంబర్‌ 28న రాగా.. డెవిల్‌ డిసెంబర్‌ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

డెవిల్‌ Vs బబుల్‌ గమ్‌ ఏ సినిమా బెస్ట్‌ అంటే..

ఈ వారం రెండు క్రేజీ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వాటిలో ఒకటి కళ్యాణ్‌ రామ్ హీరోగా నటించిన డెవిల్‌ కాగా.. మరొకటి యాంకర్‌ సుమ కుమారుడు రోషన్‌ కనకాల నటించిన ‘బబుల్‌ గమ్‌’. రోషన్‌ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అవుతున్న ‘బబుల్‌ గమ్‌’ డిసెంబర్‌ 28వ తేదీన ప్రేక్షకుల మందుకు వచ్చింది. కళ్యాణ్‌ రామ్‌ సినిమా ఓ రోజు తర్వాత డిసెంబర్‌29 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అయితే, ఈ రెండిటిని ఒకదానితో ఒకటి పోల్చినపుడు ఏది బెస్ట్‌..

డెవిల్‌ కథ ఏంటంటే..

ఓ ఊర్లో జమీందారు కూతురు మర్డర్‌ అవుతుంది. పోలీసులు ఈ మర్డర్‌ కేసులో ముద్దాయిగా జమీందారుని అరెస్ట్‌ చేస్తారు. తర్వాత ఈ కేసు బ్రిటీష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అయిన డెవిల్ ( కళ్యాణ్ రామ్) దగ్గరకు చేరుతుంది. కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో డెవిల్ కి నైషద ( సంయుక్త మీనన్) పరిచయం అవుతుంది. దర్యాప్తు మొదలయ్యాక.. ఈ కేసులో ఒక్కో చిక్కుముడి వీడుతూ చివరికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ నుండి వచ్చిన ఓ సీక్రెట్ కోడ్ వరకు వెళ్తుంది. ఓ మారు మూల చిన్న గ్రామంలో జరిగిన హత్యకి.. NIA చీఫ్ అయిన బోస్ రక్షణకి ఉన్న లింక్ ఏంటి? అన్నదే మిగిలిన కథ.

బబుల్‌ గమ్‌ కథ ఏంటంటే.. 

ఎప్పటి కైనా మంచి డీజే అవ్వాలని ఆది ( రోషన్ కనకాల) ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇతడి జీవితంలోకి అనుకోకుండా డబ్బున్న అమ్మాయి జాను ( మానస చౌదరి) వస్తుంది. ప్రేమ, పెళ్లి ఎమోషన్స్‌కు దూరంగా ఉండే జాను.. ఆదితో పరిచయం తర్వాత తన అభిప్రాయాలను మార్చుకుంటుంది. తనకు తెలియకుండానే అతడి ప్రేమలో పడిపోతుంది. వీరి ప్రేమ కథ చివరికి ఎలాంటి మలుపు తీసుకుంది? వీరిద్దరూ చివరకు కలిశారా? లేదా? అన్నదే మిగిలిన కథ.

డెవిల్‌ Vs బబుల్‌ గమ్‌

రెండు సినిమా జోనర్లు వేరు వేరు. కానీ, అల్టిమేట్‌గా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అన్నదే అసలు పాయింట్‌. డెవిల్‌ విషయానికి వస్తే.. సినిమా కంటే కథ పరిథి చాలా పెద్దది. 1940లలో సాగే కథ.. విస్తృతి పెంచుకుంటూ పోతుంది. స్వాతంత్రం, సుభాష్ చంద్రబోస్, ఆజాద్ హింద్ ఫౌజ్ అంటూ ఎన్నో టర్న్స్ తీసుకుంటుంది. ఇవన్నీ దాటుకుని క్లైమాక్స్‌కు వచ్చే సరికి ప్రేక్షకుడు డిస్‌ కనెక్ట్‌ అయిపోతూ ఉన్నాడు. కథ, కథనం విషయంలో అంతగా మెప్పించలేకపోయింది. ఇక, బబుల్‌ గమ్‌ విషయానికి వస్తే.. ఇది ఓ సాధారణ లవ్‌ స్టోరీ.. కొత్తదనం కనిపించలేదు. దానికి తోడు ఫస్ట్‌ హాఫ్‌ బోరుకొడుతుంది. లస్ట్ తప్ప ఎలాంటి ఎమోషన్ లేకుండా సాగిపోయే లవ్ ట్రాక్‌లా అనిపిస్తూ ఉంది. ఏ సినిమాకు తగ్గట్లు ఆ సినిమాకు ప్లస్‌లు మైనస్‌లు ఉన్నాయి. మరి, ఈ రెండిటిలో మీ ఓటు దేనికో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి