iDreamPost

డెవిల్‌ ఫస్ట్‌ డే కలెక్షన్‌.. ఎంత వసూలు చేసిందంటే..

డెవిల్‌ సినిమా డిసెంబర్‌ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీకి ప్రేక్షకుల నుంచే గాక, రివ్యూవర్ల దగ్గరినుంచి కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

డెవిల్‌ సినిమా డిసెంబర్‌ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీకి ప్రేక్షకుల నుంచే గాక, రివ్యూవర్ల దగ్గరినుంచి కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

డెవిల్‌ ఫస్ట్‌ డే కలెక్షన్‌.. ఎంత వసూలు చేసిందంటే..

నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన ‘డెవిల్‌’ సినిమా డిసెంబర్‌ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. రివ్యూవర్లు కూడా మంచి రివ్యూలు ఇచ్చారు. ఇక, ఈ సినిమా మొదటి రోజు మంచి వసూళ్లను సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 4.9 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. కళ్యాణ్‌ రామ్‌ గత సినిమా ‘బింబిసార’ కంటే ఈ వసూళ్లు చాలా తక్కువ కావటం గమనార్హం.

బింబిసార మొదటి రోజు వసూళ్ల వర్షం కురిపించింది. ప్రపంచ వ్యాప్తంగా 11.50 కోట్లు వసూలు చేసింది. ఈ వసూళ్లలో సగం కూడా డెవిల్‌ సాధించలేకపోయింది. రానున్న రోజుల్లో ఈ వసూళ్లు మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది. కాగా, డెవిల్‌ సినిమాలో కళ్యాణ్‌ రామ్‌ బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా కనిపించాడు. కళ్యాణ్‌ రామ్‌ సరసన సంయుక్త మీనన్‌ నటించింది. సంయుక్త మీనన్, శ్రీకాంత్ అయ్యంగార్, మాళవిక నాయర్, సత్య, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఇక, ఈ చిత్ర విడుదలకు రెండు రోజుల ముందు నుంచి దర్శకుడి విషయంలో వివాదం నెలకొంది. నవీన్‌ మేడారం అనే దర్శకుడు తానే డెవిల్‌ సినిమాను తీశానని, చివరి నిమిషంలో ఈగోల కారణంగా తనను పక్కన పెట్టారని అన్నాడు. మూవీ టైటిల్‌ క్రెడిట్స్‌లో తన పేరు వేయకపోవటం బాధకలిగించిందని అన్నారు. డెవిల్‌ కోసం ఎంతో కష్టపడ్డానని తెలిపారు. ‘‘ డెవిల్‌ కేవలం నా సృష్టి మాత్రమే. ఇది నాకు కేవలం ఓ ప్రాజెక్టు మాత్రమే కాదు. నా బిడ్డ కూడా. దాన్ని నేనే డైరెక్ట్‌ చేశాను. నా మౌనాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సినిమా తీయటంలో నేను ఎటువంటి తప్పు చేయలేదు. ఈగోలు, స్వార్థం వల్ల ఇదంతా జరిగింది’’ అని అన్నారు.

ఏజెంట్‌ కథ ఏంటంటే.. 

ఓ గ్రామంలోని జమీందారు కూతురు హత్యకు గురవుతుంది. పోలీసులు ఈ హత్య కేసులో ముద్దాయిగా జమీందారుని అరెస్ట్‌ చేస్తారు. తర్వాత ఈ కేసు బ్రిటీష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అయిన డెవిల్ ( కళ్యాణ్ రామ్) చేతికి వెళుతుంది. కేసు ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్న సమయంలో డెవిల్ కి నైషద ( సంయుక్త మీనన్) పరిచయం అవుతుంది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యాక.. ఈ కేసులో ఒక్కో చిక్కుముడి వీడుతూ చివరికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ నుండి వచ్చిన ఒక సీక్రెట్ కోడ్ వరకు కథ వెళ్తుంది. ఒక చిన్న గ్రామంలో జరిగిన హత్యకి.. NIA చీఫ్ అయిన బోస్ రక్షణకి ఉన్న లింక్ ఏమిటి? అన్నదే మిగిలిన కథ. మరి, డెవిల్‌ సినిమా మొదటి రోజు కలెక్షన్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి