iDreamPost

NTR బొమ్మ లేకుండా గెలిచే దమ్ము బాబుకు ఉందా?: మంత్రి నారాయణ స్వామి

NTR బొమ్మ లేకుండా గెలిచే దమ్ము బాబుకు ఉందా?: మంత్రి నారాయణ స్వామి

ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్ర రాజకీయాలు చాలా వేడీగా ఉన్నాయి. సమ్మర్ ను మించిన హీట్ ఏపీలో కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీ రాజకీయం అంతా చంద్రబాబు అరెస్టు చుట్టే తిరుగుతోంది. ఈ అరెస్టు అంశంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే చంద్రబాబు ఆరోగ్యంపై అధికారులు కీలక అంశాలు వెల్లడించారు. అయినా టీడీపీ నేతలు చంద్రబాబుకు అనారోగ్యంగా ఉందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక నేరస్థుడైన చంద్రబాబును అరెస్ట్ చేస్తే కులాల పేరుతో అరాచాకాలు చేస్తున్నారన్నారు. ప్రజల్ని రెచ్చగొడుతున్నారని.. మద్యపాన నిషేధం గురించి వీరంతా మాట్లాడటం విడ్డూరంగా ఉందనిని ఆయన వ్యాఖ్యానించారు.

సోమవారం ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబుది అక్రమ అరెస్టని టీడీపీ వాళ్లు అంటున్నారని, తాను మాత్రం న్యాయంగానే జరిగిన అరెస్టని అంటున్నానన్నారు. ఒకప్పుడు కేవలం రెండు ఎకరాల భూమి ఉన్న చంద్రబాబుకు.. ఇప్పుడు రూ.లక్షల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే ప్రజలు ఎవరూ పట్టించుకోవడం లేదని నారాయణ స్వామి ఎద్దేవా చేశారు. లోకేశ్ కు పదవీ కాంక్ష పట్టుకుందని, కొడుకు కోసం భువనేశ్వరి ఏమైనా చేస్తున్నారేమోనని మంత్రి తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం బాగా లేదని చెప్పడానికి భువనేశ్వరి ఏమైనా డాక్టరా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ఏనాడు  సొంతంగా గెలువలేదని, ఆ సత్తా ఆయనకు లేదని  తెలిపారు.

ఎన్టీఆర్ బొమ్మ లేకుండా గెలిచే దమ్ము చంద్రబాబుకు ఉందా అని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. ఒకవేళ అలా చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేస్తాను మంత్రి నారాయణ స్వామి సవాల్ చేశారు. ఎన్టీఆర్ మద్యాన్ని నిర్మూలించారని.. చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన ఆశయాలకు తూట్లు పొడిచారన్నారు. 1998లో మద్యపాన నిషేధాన్ని ఎత్తేసింది చంద్రబాబేనని.. అలా చేయకపోతే ప్రభుత్వం నడపలేమని చంద్రబాబు ప్రకటించారంటూ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఫుల్ ఫైర్ అయ్యారు. మరి.. చంద్రబాబుపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి