iDreamPost

పబ్లిక్ లో లవర్స్ హగ్గులు, ముద్దులు.. దిమ్మతిరిగే షాకిచ్చిన పోలీసులు

పబ్లిక్ లో లవర్స్ హగ్గులు, ముద్దులు.. దిమ్మతిరిగే షాకిచ్చిన పోలీసులు

గత కొన్ని రోజుల నుంచి కొందరు ప్రేమికులు హద్దులు దాటి మితిమీరి ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ రొమాన్స్ చేస్తూ కామంతో ఊగిపోతున్నారు. మరీ ముఖ్యంగా నడిరోడ్డులో లవర్స్ బైక్ పై వెళ్తూ హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతున్నారు. మొన్నటికి మొన్న దేశ రాజధాని ఢిల్లీలోని మంగోల్ పురి సమీపంలో ఓ ప్రేమ జంట బైక్ పై వెళ్తున్నారు. ఇక ఆ ఇద్దరు ప్రేమికులు బైక్ పైనే హద్దులు దాటి రొమాన్స్ ను పిండుకున్నారు.

అయితే, ఈ తతంగాన్ని గమనించిన కొందరు వాహన దారులు తమ తమ సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. ఇక అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఇదే వీడియోపై మెల్ల మెల్లగా పోలీసుల వరకు వెళ్లింది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు ఆ లవర్స్ కు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఈ ప్రేమికులపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. దీంతో పాటు రూ.11,000 వేల జరిమానా కూడా విధించారు. ఈ దెబ్బతో ఈ లవర్స్ కుక్కిన పెనులా మారిపోయారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం చేసిన వారిపై కఠని చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: వీడియో: యువతిని ఢీకొట్టిన కారు.. కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లి..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి