iDreamPost

భార్యభర్తల మధ్యలోకి వచ్చే హక్కు ఎవరికీ లేదు!!

భార్యభర్తల మధ్యలోకి వచ్చే హక్కు ఎవరికీ లేదు!!

ఆడ, మగ ఒకరినొకరు ఇష్టపడి, పరస్పర అంగీకారంతో భార్యా, భర్తలుగా జీవిస్తుంటారు. అయితే వీరిపై కుటుంబ సభ్యుల ఒత్తిడి, జోక్యం చేసుకోవడం సహజంగా జరుగుతూనే ఉంటుంది. ఇది చాలామంది జంటల దాంపత్య జీవితంపై ప్రభావం చూపిస్తుంది.

తాజాగా ఈ విషయంపై దిల్లీ సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది. భార్యా భర్తలుగా ఉంటున్న మేజర్ల జీవితాల్లో జోక్యం చేసుకోవడం కుదరదని స్పష్టం చేసింది. మూడో వ్యక్తికి ఎలాంటి ప్రమేయం ఉండబోదని చెప్పింది. అసలు కుటుంబ సభ్యులకు సైతం ఆ హక్కు లేదని పేర్కొంది.

పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్ళి చేసుకున్న ఒక జంట తమకు రక్షణ కావాలంటూ దాఖలు చేసింది. ఈ సందర్భంగా దిల్లీ హైకోర్టు ఈ అంశాలను వెల్లడించింది. వివాహిత జంటలను కులమతాలకు అతీతంగా చూడాలని, వారిని రక్షించాల్సిన రాజ్యాంగబద్ధ బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్ట చేసింది. కేసును విచారించిన జస్టిస్ తుషార్ రావు గేదెల ఈ కేసును విచారించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి