iDreamPost

డియర్ మేఘా రిపోర్ట్

డియర్ మేఘా రిపోర్ట్

ఇవాళ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల సందడి నెలకొంది. పోయిన శుక్రవారం భారీ అంచనాల మధ్య వచ్చిన శ్రీదేవి సోడా సెంటర్ నిరాశ పరచడంతో మూవీ లవర్స్ కు ఈ రోజు గట్టి ఆప్షన్ ఏమీ దొరకలేదు. ఉన్నంతలో 101 జిల్లాల అందగాడు, డియర్ మేఘ కాస్త ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. కన్నడలో రూపొంది అక్కడ అద్భుతమైన స్పందన దక్కించుకున్న దియా రీమేక్ గా వచ్చిన డియర్ మేఘ మీద యూత్ కు ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. ఒరిజినల్ వెర్షన్ తెలుగు డబ్బింగ్ యుట్యూబ్ లో కొద్దిరోజుల క్రితమే విడుదలైన నేపథ్యంలో రీమేక్ కు ఎలాంటి స్పందన వస్తుందోననే ఆసక్తి పరిశ్రమలో ఉంది. ఎలా ఉందో సింపుల్ రిపోర్ట్ లో చూసేద్దాం

ఇది ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిల మధ్య నడిచే ప్రేమకథ. కాకపోతే గతంలో వచ్చిన వాటి మాదిరి రెగ్యులర్ గా వుండకపోవడమే దీని ప్రత్యేకత. మేఘ(మేఘ ఆకాష్)కాలేజీలో ఉన్నప్పుడే అర్జున్(అర్జున్ సోమయాజులు)ని వన్ సైడ్ లవ్ చేస్తుంది. అతనికి చెప్పే సాహసం చేయదు. ఈలోగా అర్జున్ విదేశాలకు వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మూడేళ్లు గడిచిపోతాయి. తిరిగి వచ్చాక అర్జున్ మేఘకు ఐ లవ్ యు చెబుతాడు. ఊహించని మలుపుల తర్వాత అభి(ఆదిత్ అరుణ్)వీళ్ళ జీవితంలో ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, వీళ్ళ ముగ్గురి ప్రయాణం ఏ మజిలీకి చేరుకుంది లాంటివి ఊహించని క్లైమాక్స్ తో తెరమీద చూడాలి. క్లుప్తంగా ఇది కథ.

చాలా హృద్యమైన ఈ ప్రేమకథను కన్నడ ఆడియన్స్ కి అంత బాగా ఎందుకు కనెక్ట్ అయ్యిందనేది పక్కనపెడితే ఈ తరహా వ్యవహారాలు గతంలో చాలా చూసేసిన మన ప్రేక్షకులకు ఇందులో నెమ్మదితనం నచ్చడం కష్టమే. పైగా దియాలో హీరోయిన్ పెర్ఫార్మన్స్ రేంజ్ ని మేఘా ఆకాష్ బెస్ట్ ఇచ్చినప్పటికీ పూర్తిగా మ్యాచ్ చేయలేకపోయింది. అక్కడి కథనంలో ఉన్న సున్నితత్వం మనదగ్గరకు వచ్చేటప్పటికీ ల్యాగ్ గా కన్వర్ట్ కావడంతో ఆడియన్స్ అందరికీ నచ్చుతుందన్న గ్యారెంటీని మిస్ అయ్యింది. దర్శకుడు సుశాంత్ రెడ్డి టేకింగ్ అండ్ టీమ్ ఎఫర్ట్ లో నిజాయితీ ఉన్నా స్లో పేస్ తో నడిచే ఇలాంటి డ్రామాలు టాలీవుడ్ జనానికి అంత సులభంగా వర్కౌట్ కావు.

Also Read : మరో వివాదంలో దర్శకుడు శంకర్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి