iDreamPost

కర్నూలు ఆస్పత్రిలో ఐదేళ్ల బాలుడికి నరకం! చివరికి తెలివిగా !

సాధారణంగా లిఫ్ట్ లేదా ఓ చీకటి గదిలో ఇరుక్కుపోతే పరిస్థితి ఎలా ఉంటుంది. మహా అయితే అరుస్తాం, గట్టిగా తలుపులు కొడతాం. కానీ అక్కడ ఎవ్వరూ లేకపోతే.. ఊహించడానికి భయంగా ఉంది కదా.. కానీ ఓ 5 ఏళ్ల పిల్లాడు..అందులోనూ..

సాధారణంగా లిఫ్ట్ లేదా ఓ చీకటి గదిలో ఇరుక్కుపోతే పరిస్థితి ఎలా ఉంటుంది. మహా అయితే అరుస్తాం, గట్టిగా తలుపులు కొడతాం. కానీ అక్కడ ఎవ్వరూ లేకపోతే.. ఊహించడానికి భయంగా ఉంది కదా.. కానీ ఓ 5 ఏళ్ల పిల్లాడు..అందులోనూ..

కర్నూలు ఆస్పత్రిలో ఐదేళ్ల బాలుడికి నరకం! చివరికి తెలివిగా !

ఇప్పుడు సర్వైకల్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు ఆదరణ పెరిగింది. ఇలాంటి కథలకు మలయాళ ఇండస్ట్రీ ప్రాణం పోస్తుంది. ఇటీవల వచ్చిన మంజుమ్మెల్ బాయ్స్ ఈ కోవలోకే వస్తుంది. సినిమా చూస్తుంటే టెన్షన్ పడిపోతుంటారు. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా ఇలాంటి చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. అలాంటి మూవీల్లో ఒకటి.. 2019లో వచ్చిన హెలెన్. దీన్ని హిందీలో మిలి పేరుతో రీమేక్ చేశారు కూడా. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. ఇక ఈ కథ విషయానికి వస్తే.. ఓ పిజ్జా రెస్టారెంట్‌లో పనిచేసే ఉద్యోగిని.. అనుకోకుండా.. ఫ్రిజర్‌లో లాక్ అయిపోతుంది. అక్కడ నుండి ఆమె ప్రాణాలతో బయటపడింది అనేది కథ. కానీ నిజ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఆందోళన కలిగిస్తుంటాయి.

తాజాగా కర్నూలు జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆసుపత్రిలో చికిత్సకు వెళ్లిన ఐదేళ్ల ఓ పిల్లాడు.. గదిలో చిక్కుకుపోయి రాత్రంతా ఉండిపోయాడు. కుమారుడు కనిపించకపోడంతో పాటు ఏం అయ్యిందో తెలియక కన్నీరుమున్నీరు అయ్యారు తల్లిదండ్రులు. అయితే చివరకు సురక్షితంగా బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నారు తల్లిదండ్రులు, ఆసుపత్రి సిబ్బంది. అనుకోవచ్చు.. అతడు పిలవచ్చు కదా..అరవొచ్చు కదా. పిలిస్తే అతడికి వినబడలేదా అని. కానీ అతడు చెప్పలేని, వినలేని స్థితిలో ఉన్నాడు. ఆ 5 ఏళ్ల చిన్నారి డఫ్ అండ్ డంబ్ (చెవిటి, మూగ). వివరాల్లోకి వెళితే.. ఓర్వకల్లు మండలం తిప్పాయి పల్లెకు చెందిన ఉస్సేనయ్య, మౌనికలకు కుమారుడు సుజిత్ ఉన్నాడు. పుట్టుకతో బాలుడు చెవిటి, మూగ. ఈ క్రమంలో సర్జరీ కోసం మూడు వారాల క్రితం ఆసుపత్రిలో చేర్పించారు.

ఆదివారం తల్లి బయటకు వెళ్లడంతో.. బాలుడు ఆడుకుంటూ.. వార్డు పక్కనే ఉన్న ఎనస్థీషియా డిపార్ట్ మెంట్ హెడ్ గదిలోకి వెళ్లిపోయాడు. సిబ్బంది అదే గదిని శుభ్రం చేసి.. చిన్నారిని గమనించకుండా తాళం వేసుకుని వెళ్లిపోయారు. అంతలో ఆసుపత్రికి వచ్చిన తల్లి మౌనిక కొడుకు కనిపించకపోవడంతో కంగారు పడింది. ఆసుపత్రి అంతా జల్లెడ పట్టారు. సిబ్బంది కూడా వెతకసాగారు. ఎంతకు కొడుకు జాడ లేకపోవడంతో తల్లి ఆదివారం రాత్రంతా ఏడుస్తూనే ఉంది. సోమవారం ఉదయం డిపార్ట్ మెంట్ హెడ్ గది తలుపులు తీయగా.. సుజిత్ పరుగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. దీంతో తల్లిదండ్రులు ఆనందలో మునిగిపోయారు. అయితే రాత్రంతా..డిపార్ట్ మెంట్ హెడ్ గదిలో ఉన్న ఫ్రిజ్‌లో వాటర్ ప్రాణాలు కాపాడుకున్నాడు ఈ పిల్లవాడు. ఈ విషయాన్ని సైగల ద్వారా తల్లిదండ్రులకు చెప్పగానే.. సిబ్బంది తెలియజేశారు. మొత్తానికి ఒక్కడే రాత్రంతా బిక్కు బిక్కుమని గడపడంతో పాటు అలాంటి స్థితిలోనూ తెలివిగా ఆలోచించి ప్రాణాలు కాపాడుకున్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి