iDreamPost

Dasara Bullodu : పల్లెటూరి సినిమాల్లో నిజమైన ట్రెండ్ సెట్టర్

ఆయనే ఒక కథ రాసుకుని దాన్నిఏళ్ల తరబడి డెవలప్ చేసుకుంటూ వచ్చారు. తమ సంస్థ ఆస్థాన దర్శకుడు వి మధుసూదనరావుతో తీయాలని ప్లాన్. కానీ రావుగారి డేట్లు ఖాళీ లేవు. కథేమో అక్కినేని నాగేశ్వరరావు గారికి విపరీతంగా నచ్చేసింది. ఎవరో ఎందుకు నువ్వే డైరెక్ట్ చేయరాదూ అంటూ విబి రాజేంద్రప్రసాద్ ని ప్రోత్సహించారు. హీరో అంత ధైర్యం ఇచ్చాక ఆగుతారా.

ఆయనే ఒక కథ రాసుకుని దాన్నిఏళ్ల తరబడి డెవలప్ చేసుకుంటూ వచ్చారు. తమ సంస్థ ఆస్థాన దర్శకుడు వి మధుసూదనరావుతో తీయాలని ప్లాన్. కానీ రావుగారి డేట్లు ఖాళీ లేవు. కథేమో అక్కినేని నాగేశ్వరరావు గారికి విపరీతంగా నచ్చేసింది. ఎవరో ఎందుకు నువ్వే డైరెక్ట్ చేయరాదూ అంటూ విబి రాజేంద్రప్రసాద్ ని ప్రోత్సహించారు. హీరో అంత ధైర్యం ఇచ్చాక ఆగుతారా.

Dasara Bullodu : పల్లెటూరి సినిమాల్లో నిజమైన ట్రెండ్ సెట్టర్

1970 సంవత్సరం. నిర్మాత విబి రాజేంద్రప్రసాద్(జగపతిబాబు తండ్రి)అప్పటికే తన జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద అద్భుతమైన బ్లాక్ అండ్ వైట్ హిట్ సినిమాలు తీశారు. ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు లాంటివి మరపురాని చిత్రాలుగా మిగిలాయి. మొదటిసారి కలర్ లో ఒక మంచి మూవీ తీయాలని సంకల్పించుకున్నారు. తన స్వంత గ్రామంలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని ఆయనే ఒక కథ రాసుకుని దాన్నిఏళ్ల తరబడి డెవలప్ చేసుకుంటూ వచ్చారు. తమ సంస్థ ఆస్థాన దర్శకుడు వి మధుసూదనరావుతో తీయాలని ప్లాన్. కానీ రావుగారి డేట్లు ఖాళీ లేవు. కథేమో అక్కినేని నాగేశ్వరరావు గారికి విపరీతంగా నచ్చేసింది. ఎవరో ఎందుకు నువ్వే డైరెక్ట్ చేయరాదూ అంటూ విబి రాజేంద్రప్రసాద్ ని ప్రోత్సహించారు. హీరో అంత ధైర్యం ఇచ్చాక ఆగుతారా.

హీరోయిన్ గా ముందు జయలలితను అనుకుని ఏవో కారణాల వల్ల ఆ స్థానంలో వాణిశ్రీని తీసుకున్నారు. ఆవిడ కాల్ షీట్లు లేకపోతే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారని అప్పట్లో కథనం వచ్చింది. ఎస్వి రంగారావు, గుమ్మడి, నాగభూషణం, సూర్యకాంతం, అంజలీదేవి, పద్మనాభం, ఛాయాదేవి, రావికొండలరావు ఇలా లెజెండరీ క్యాస్టింగ్ ని సెట్ చేసుకున్నారు రాజేంద్రప్రసాద్. హీరో వాడే ఫారిన్ కారుని సెకండ్ హ్యాండ్ లో ప్రత్యేకంగా కొని తీసుకొచ్చారు. ఆచార్య ఆత్రేయ మాటలు పాటలు సిద్ధం చేయగా మామ కెవి మహదేవన్ రాష్ట్రం మొత్తం ఉర్రూతలూగిపోయే పాటలను కంపోజ్ చేశారు.కృష్ణాజిల్లాలో అధిక భాగం చిత్రీకరణ జరిగింది.

ఊరంతా సరదాగా తిరిగే దసరాబుల్లోడు గోపి. ఇతనికి తల్లితండ్రులు లేకపోయినా అంతకన్నా ఎక్కువగా పెంచిన అన్నావదిన, దత్తత తీసుకున్న ప్రెసిడెంట్ దంపతులు, ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే పాత్రలో ఏఎన్ఆర్ జీవించేశారు. సెకండ్ హీరోయిన్ గా క్యాన్సర్ తో బాధ పడే నిర్మలగా చంద్రకళ నటన మహిళలతో కన్నీళ్లు పెట్టించింది. 1971 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన దసరా బుల్లోడు వీరవిహారం చేసింది. ఎక్కడ విన్నా ఇవే పాటలు. 11న పోటీగా వచ్చిన ఎన్టీఆర్ శ్రీకృష్ణ విజయమును దాటుకుని మరీ వసూళ్ల వర్షం కురిపించింది. 23 కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు, 1 సెంటర్ లో ఏడాది పాటు ఆడేసి రికార్డులు సృష్టించింది. అక్కినేని ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకున్న విబి రాజేంద్రప్రసాద్ ఆ తర్వాత ఏకంగా 17 సినిమాలు డైరెక్ట్ చేయడం విశేషం

Also Read : Ananda Bhairavi : సంగీతనృత్య అపురూప దృశ్యకావ్యం – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి